త్వరలో ప్రేక్షకుల ముందుకు హారర్ థ్రిల్లర్ ‘ఐందవి’.. విడుదల డేట్‏ను ప్రకటించిన చిత్రయూనిట్..

నందు, అనురాధ జంటగా నటిస్తున్న సినిమా ఐందవి. పూర్తిగా హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రముఖ దర్శకుడు ఫణిరామ్ తుఫాన్. సన్ని అండ్ విన్నీ సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ లింగం ఈ మూవీని నిర్మిస్తున్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు హారర్ థ్రిల్లర్ 'ఐందవి'.. విడుదల డేట్‏ను ప్రకటించిన చిత్రయూనిట్..
Follow us

|

Updated on: Dec 14, 2020 | 8:46 PM

నందు, అనురాధ జంటగా నటిస్తున్న సినిమా ఐందవి. పూర్తిగా హారర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రముఖ దర్శకుడు ఫణిరామ్ తుఫాన్. సన్ని అండ్ విన్నీ సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ లింగం ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం డిసెంబర్ 18న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత శ్రీధర్ లింగం తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. లాక్‏డౌన్ కంటే ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. కానీ థియేటర్లు ఖాళీ లేకపోవడంతో రీలిజ్ వాయిదా పడింది. సినిమాను థియేటర్లలో చూస్తే అనుభూతి వేరు. ఆ అనుభూతిని ప్రేక్షకులకు ఇవ్వాలనే ఎంత ఆలస్యమైనా థియేటర్లలోనే మా సినిమాను విడుదల చేస్తున్నాం. హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా సాగుతుంది. జన సంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని వెళ్ళిన ఆరుగురిలో ఒకరు హత్యకు గురవుతారు. ఆ హత్యలు చేసిందెవరు, ఐందవికి ఈ హత్యలకు సంబంధం ఏంటి అనేది ఈ మూవీ కథగా ఉంటుంది అని తెలిపారు. నందు ఈ సినిమాను డిసెంబర్ 18న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని తెలిపారు.