ఆకట్టుకుంటున్న ‘విశ్వామిత్ర’ ట్రైలర్‌

హైదరాబాద్‌: నందిత, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విశ్వామిత్ర’. రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో నందితకు ఓ వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. కానీ అతను ప్రాణాలతో ఉండడు. ఇదే విషయం గురించి నందిత పోలీసు అధికారి అయిన ప్రసన్నకు చెబుతుంది. అతను నమ్మడు. ‘చనిపోయివాడు వచ్చి […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:24 pm, Mon, 25 February 19
ఆకట్టుకుంటున్న ‘విశ్వామిత్ర’ ట్రైలర్‌

హైదరాబాద్‌: నందిత, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విశ్వామిత్ర’. రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోమవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రసన్న పోలీసు అధికారి పాత్రలో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో నందితకు ఓ వ్యక్తి కనిపించకుండా సాయం చేస్తుంటాడు. కానీ అతను ప్రాణాలతో ఉండడు. ఇదే విషయం గురించి నందిత పోలీసు అధికారి అయిన ప్రసన్నకు చెబుతుంది. అతను నమ్మడు. ‘చనిపోయివాడు వచ్చి నీ సమస్యలు తీర్చాడంటే నమ్మడానికి నేను పిల్లోడిని కాను పోలీసోడిని’ అని కొట్టిపారేస్తాడు. ‘ఈ విశ్వంలో మానవ మేథస్సుకు అందని విషయాలు చాలా ఉన్నాయి’ అంటూ ఆసక్తికరమైన అంశాలతో సినిమాను రూపొందించారు.

సత్యం రాజేశ్‌, అశుతోశ్ రాణా‌ కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాధవి అద్దంకి, రజనీకాంత్‌, రాజాకిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.