కొత్త సినిమా కోసం.. బాలయ్య ఇలా చేస్తారనుకోలేదు..!

కొత్త సినిమా కోసం.. బాలయ్య ఇలా చేస్తారనుకోలేదు..!

నటన కోసం బాలయ్య బాబు ఎంతటి సాహసానికికైనా సిద్ధపడతారని.. ఆయనతో నటించిన ఆర్టిస్ట్‌లందరూ చెబుతూంటారు. అలాగే.. ఎంత పెద్ద డైలాగ్స్‌ అయినా.. ఒక్క టేక్‌లో చెప్పగల సిద్ధహస్తుడు. కాగా.. బాలయ్య 105 సినిమా లేటెస్ట్‌ లుక్స్‌లో ఆయన సూపర్బ్‌గా ఉన్నారు. సన్నగా.. యంగ్‌ లుక్‌తో.. పిల్లి గడ్డంతో.. ఫ్రెంచ్ లుక్‌‌లో వున్న బాలయ్యను చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. ఈ సినిమా కోసం బాలయ్య పెద్ద సాహసమే చేశాడు. స్టైలిష్ లుక్‌ రావడం కోసం.. ఆయన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 08, 2019 | 1:23 PM

నటన కోసం బాలయ్య బాబు ఎంతటి సాహసానికికైనా సిద్ధపడతారని.. ఆయనతో నటించిన ఆర్టిస్ట్‌లందరూ చెబుతూంటారు. అలాగే.. ఎంత పెద్ద డైలాగ్స్‌ అయినా.. ఒక్క టేక్‌లో చెప్పగల సిద్ధహస్తుడు. కాగా.. బాలయ్య 105 సినిమా లేటెస్ట్‌ లుక్స్‌లో ఆయన సూపర్బ్‌గా ఉన్నారు. సన్నగా.. యంగ్‌ లుక్‌తో.. పిల్లి గడ్డంతో.. ఫ్రెంచ్ లుక్‌‌లో వున్న బాలయ్యను చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

కాగా.. ఈ సినిమా కోసం బాలయ్య పెద్ద సాహసమే చేశాడు. స్టైలిష్ లుక్‌ రావడం కోసం.. ఆయన ఏకంగా 11 కిలోల బరువు తగ్గారని.. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను వెల్లడించారు. కేఎస్ రవికుమార్ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ. ఇందులో ఆయన ఫ్రెంచ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సో.. ఆ క్యారెక్టర్ కోసం బాలయ్యను బరువు తగ్గమని తాను కోరికట్టు తెలిపారు బోయపాటి.

కాగా.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో బాలయ్య ఒకే మూసలో.. అదే గంభీర్యంతో.. సినిమాలు చేస్తున్నారు. మధ్యలో.. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో కాస్త డిఫెరెంట్‌గా కనిపించారు. అలాగే.. ఇప్పుడు బాలకృష్ణ 105 సినిమాలో లుక్‌లో కూడా బాలయ్య డిఫెరెంట్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ని అలరిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్‌ స్టర్‌గా చేస్తున్నట్లు సమాచారం.

Nandamuri Balakrishna weight loss upto 10kgs for ks ravikumar movie

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu