BB3 Movie Title Locked : గాడ్ ఫాదర్ గా వస్తామంటున్న నందమూరి బాలకృష్ణ , బోయపాటి

కొన్ని కొన్ని కాంబినేషన్ లో సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్..

BB3 Movie Title Locked : గాడ్ ఫాదర్ గా వస్తామంటున్న నందమూరి బాలకృష్ణ , బోయపాటి
Follow us

|

Updated on: Feb 19, 2021 | 6:52 PM

BB3 Movie Title: కొన్ని కొన్ని కాంబినేషన్ లో సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటిలది. వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ వస్తుంది..

తాజాగా బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఐతే తాజాగా ఈ సినిమా కు టైటిల్ ఖరారు చేశారనే టాక్ ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది.

నందమూరి బోయపాటి కాంబోలో మూవీ అంటేనే నందమూరి అభిమానులకు పండగ. ‘బీబీ3’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే పలు రకాల టైటిల్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే పేరును చిత్రబృందం ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ‘బీబీ3’ ఫస్ట్ రోర్ పేరట రిలీజ్ చేసిన వీడియో ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు. సినిమా వేసవి వినోదంగా మే 28న రిలీజ్ కానున్నది.

Also Read:

: ఒడిస్సాలోని జాలరి వలలో చిక్కుకున్న అరుదైన గంగా డాల్ఫిన్ మృతదేహం..

ఆర్థిక మోసాలపై ఆర్బీఐ వినూత్న అవగాహన.. వీడియో సాంగ్‌ విడుదల.. సోషల్‌ మీడియాలో వైరల్‌