‘సైరా’ మూవీని అడ్డుకున్న ముస్లిం యువత

'సైరా' మూవీని అడ్డుకున్న ముస్లిం యువత

బీదర్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సైరా నరసింమారెడ్డి మూవీని షూటింగ్‌ను ముస్లిం యువత అడ్డుకున్నారు. చిత్రీకరణ నిమిత్తం బీదర్ పట్టణంలోని బహుమనీ కోటలు షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌పై కీలక సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సడెన్‌గా స్థానిక ముస్లిం యువత ప్రత్యక్షమై షూటింగ్‌ను అడ్డుకున్నారు. బహుమనీ కోటలో ఉన్న ముస్లింల ప్రార్ధనా స్థలంలో షూటింగ్ నిమిత్తం పలు హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఫొటోలను ఏర్పాటు చేశారని, […]

Vijay K

|

Feb 25, 2019 | 1:17 PM

బీదర్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సైరా నరసింమారెడ్డి మూవీని షూటింగ్‌ను ముస్లిం యువత అడ్డుకున్నారు. చిత్రీకరణ నిమిత్తం బీదర్ పట్టణంలోని బహుమనీ కోటలు షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌పై కీలక సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సడెన్‌గా స్థానిక ముస్లిం యువత ప్రత్యక్షమై షూటింగ్‌ను అడ్డుకున్నారు.

బహుమనీ కోటలో ఉన్న ముస్లింల ప్రార్ధనా స్థలంలో షూటింగ్ నిమిత్తం పలు హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఫొటోలను ఏర్పాటు చేశారని, అది తమకు అభ్యంతరకరమని ముస్లిం యువత అంటున్నారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీదర్ జిల్లా అధికారి ఇంటి ముందు నిరసన కూడా తెలిపారు. చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో షూటింగ్ కోసం చిత్ర బృందం పురావస్తు శాఖ నుంచి అనుమతి కూడా తీసుకుంది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, నయనతార.. తదితర ప్రముఖ నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu