మళ్లీ అదే తప్పు చేస్తోన్న ప్రభాస్ టీమ్..!

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను అనుకున్నంత మేర అందుకోలేకపోయింది సాహో. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర కథ పాతది కావడం.. స్క్రీన్‌ప్లే గజిబిజీ ఉండటంతో అన్ని వర్గాలను ప్రభాస్ మెప్పించలేకపోయాడు. ఇక ఈ మూవీకి మైనస్‌గా మారిన వాటిలో మ్యూజిక్ కూడా ఒకటి. బాలీవుడ్‌కు తగ్గట్లుగా ఈ మూవీలోని […]

మళ్లీ అదే తప్పు చేస్తోన్న ప్రభాస్ టీమ్..!
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 4:41 PM

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వారి అంచనాలను అనుకున్నంత మేర అందుకోలేకపోయింది సాహో. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర కథ పాతది కావడం.. స్క్రీన్‌ప్లే గజిబిజీ ఉండటంతో అన్ని వర్గాలను ప్రభాస్ మెప్పించలేకపోయాడు. ఇక ఈ మూవీకి మైనస్‌గా మారిన వాటిలో మ్యూజిక్ కూడా ఒకటి. బాలీవుడ్‌కు తగ్గట్లుగా ఈ మూవీలోని పాటలు ఉండగా.. దక్షిణాది ప్రేక్షకులను సాహో ఆల్బమ్ ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ మూవీకి మొదటగా సంగీత దర్శకులుగా బాలీవుడ్ త్రయం శంకర్- ఇషాన్- లాయ్‌ను ఎంచుకున్న టీమ్.. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. కానీ ఈ సినిమా కోసం తమకు తెలియకుండా దర్శకనిర్మాతలను వేరే వారితో పాటలను చేయించుకున్నారని ఆరోపించిన ఈ త్రయం.. ఈ మూవీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అది కూడా మూవీ విడుదల తేదీ దగ్గరపడుతోన్న సమయంలో.. వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వచ్చేశారు. ఇక చేసేదేం లేక బాలీవుడ్‌కు చెందిన తనిష్క్ బాగ్చీ, గురు రాద్వా, బాద్‌ షా‌లతో ఒక్కో పాటను చేయించుకున్నారు సాహో టీమ్. అలాగే శంకర్-ఇషాన్- లాయ్ అనుమతితో వారు చేసిన ఓ పాటను ఇందులో పెట్టుకున్నారు. అయితే పాటలను పక్కనబెడితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు గిబ్రాన్‌‌ను ఎంచుకోగా.. అందులో మాత్రం అతడికి మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికి సాహోకు సంగీతం మైనస్‌గా మారింది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమ కథలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీక‌ృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 30శాతానికి పైగా కంప్లీట్ అయ్యింది. అయితే ఇంతవరకు ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు కాలేదు. కనీసం ఈ సినిమాకు పలనా దర్శకుడు పనిచేయబోతున్నాడంటూ పుకార్లు కూడా రాలేదు. దీంతో ప్రభాస్ టీమ్ మళ్లీ అదే తప్పు చేస్తుందా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సినిమాకు కథ, కథనం, నటీనటులు ఎంత అవసరమో సంగీతం కూడా అంతే అవసరం. అందుకే చాలా మంది దర్శకులు తాము తెరకెక్కించే సినిమాలకు మొదట్లోనే మ్యూజిక్ డైరక్టర్‌లను ఎంపిక చేసుకుంటారు. ఇలా చేయడం వలన టాకీ షూటింగ్‌తో పాటు పాటలను చిత్రీకరించొచ్చని.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం కేటాయించవచ్చని భావిస్తుంటారు. కానీ ప్రభాస్ టీమ్ మాత్రం సంగీత దర్శకుడిని ఇంకా ఎంపిక చేయకపోవడం గమనర్హం. ఇప్పటికీ మ్యూజిక్ డైరక్టర్‌ను ఎంచుకోకపోతే.. మళ్లీ సాహోకు జరిగినట్లుగానే.. చివర్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు భావిస్తున్నారు.  మరి ప్రభాస్ తదుపరి చిత్రానికి సంగీత దర్శకుడిని ఎప్పుడు ఖరారు చేస్తారు..? ప్రభాస్ మూవీకి ఛాన్స్ కొట్టే మ్యూజిక్ డైరక్టర్ ఎవరు..? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..