Actor SV Ramanan: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట్లో విషాదం.. అనారోగ్య సమస్యలతో నటుడు ఎస్వీ రమణన్ కన్నుమూత..

ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్వీ రమణన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు.

Actor SV Ramanan: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట్లో విషాదం.. అనారోగ్య సమస్యలతో నటుడు ఎస్వీ రమణన్ కన్నుమూత..
Sv Ramanan
Follow us

|

Updated on: Sep 27, 2022 | 7:55 AM

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తాత సీనియర్ డైరెక్టర్.. రేడియో డబ్బింగ్ కళాకారుడు.. నటుడు ఎస్వీ రమణన్ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 26న సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్వీ రమణన్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేశారు.

1930-40లో పలు చిత్రాలకు దర్శకత్వంలో వహించిన కె.సుబ్రమణియన్ కుమారుడే ఎస్వీ. రమణన్. తండ్రి సహాయంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన రమణన్.. పలు శాఖల్లో పేరు తెచ్చుకున్నారు. రేడియో రంగంలో పలు ప్రయోగాలు చేశారు. వేలాది రేడియో ప్రసారాలకు డబ్బింగ్ చెప్పారు. భక్తిరస లఘు చిత్రాలను రూపొందించారు. దొరబాబు శోభనం, ఉరువంగల్ మరళం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎస్వీ రమణన్ కు భార్య భామా రమణన్, కుమార్తెలు లక్ష్మి, సరస్వతి ఉన్నారు. గతంలో తన మనవడు అనిరుధ్ చిత్రపరిశ్రమలో ఎదుగుదలను చూసి మురిసిపోతున్నట్లు చెప్పారు రమణన్. ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో తన మనవడు కూడా ఉండడంతో తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. ఎస్వీ రమణన్ మృతితో అనిరుధ్ ఇంట్లో విషాధాచాయలు అలుముకున్నాయి