Most Eligible Bachelor : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ పై నో క్లారిటీ.. సంక్రాంతికి కాకపోతే సమ్మర్‌కే

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు..

Most Eligible Bachelor : 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రిలీజ్ పై నో క్లారిటీ.. సంక్రాంతికి కాకపోతే సమ్మర్‌కే
Follow us

|

Updated on: Jan 06, 2021 | 1:34 PM

Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గ నటిస్తుంది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల పైన మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది.

మాస్ మారాజా రవితేజ ‘క్రాక్’ సినిమా, బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’, దళపతి విజయ్ ‘మాస్టర్’, రామ్ ‘రెడ్’.. ఇలా మరికొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పోటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ను విడుదల చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారట నిర్మాతలు. కానీ ఇప్పుడు కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారట. అందుకే సినిమా సంక్రాంతికి విడుదల కావట్లేదని అంటున్నారు.  ఇక ఈ సినిమాకోసం సమ్మర్ వరకు ఆగాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలనీ చూస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఎట్టిపరిస్థితిలో సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. దాంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సమ్మర్ లోనే  రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Adipurush director: ప్రభాస్‌ ఒప్పుకోకపోతే ఆదిపురుష్‌ సినిమాను చేసేవాడినే కాదు: ఓం రౌత్‌

Banita Sandhu tests positive : కరోనా బారిన పడిన మరో హీరోయిన్.. ఇటీవలే యూకే నుంచి వచ్చిన బ్యూటీ