వాళ్ల గొప్పేంటి? సమానత్వం కోసం పోరాటమా? మగాధిపత్యంపై తిరుగుబాటా?

అవకాశాలొచ్చాక పడే కష్టం కంటే.. ఆ అవకాశాల కోసం పడుతున్న పాట్లు మాటల్లో చెప్పేవి కావు. 'కాస్టింగ్ కౌచ్' అనే అందమైన పదం పెట్టారు గానీ.. దానివెనకున్న వల్గారిటీ దారుణం. ఇండస్ట్రీలో మేల్ డామినేషన్‌కు ఉన్న మరో వల్గర్ రూపం అది. సినీ ఇండస్ట్రీ ఫుల్లీ మేల్ డామినేటెడ్. ఈ విషయాన్ని బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలోని హీరోల దాకా అంతా ఒప్పుకుంటున్నారు. తమతో సమానంగా హీరోయిన్లూ కష్టపడుతున్నారని చెబుతున్నారు.

వాళ్ల గొప్పేంటి? సమానత్వం కోసం పోరాటమా? మగాధిపత్యంపై తిరుగుబాటా?
Indian Film Industry

Updated on: Oct 11, 2025 | 9:50 PM

భానుమతి రామకృష్ణ. అగ్రహీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌..! సినిమా బడ్జెట్‌లో సగం ఆమె పారితోషకమే ఉండేదని చెబుతుంటారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డ్ ఇప్పటికీ పదిలంగా ఉందంటుంటారు. సినీ ఇండస్ట్రీ ఒక్క హీరోలదే కాదు.. అంతే సమానంగా కష్టపడుతున్న హీరోయిన్లది కూడా అని ఆకాలంలోనే చూపించారు. మరి తరువాత ఏమైంది? నో డౌట్.. సినీ ఇండస్ట్రీ ఫుల్లీ మేల్ డామినేటెడ్. ఈ విషయాన్ని బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలోని హీరోల దాకా అంతా ఒప్పుకుంటున్నారు. తమతో సమానంగా హీరోయిన్లూ కష్టపడుతున్నారని చెబుతున్నారు. అయినా సరే.. రెమ్యునరేషన్ దగ్గరికి వచ్చే సరికి.. హీరో వందల కోట్లు తీసుకుంటున్నాడు. హీరోయిన్‌కు మాత్రం లక్షల్లో ఇస్తున్నారు. దీనికితోడు.. ‘రోజుకు 8 గంటలు’ రూల్. కొందరు హీరోలు పని చేసేది రోజుకు 8 గంటలే. అందులోనూ వీకెండ్స్ హాలిడే. మరి హీరోయిన్లకు ఎందుకు ఉండవ్ అలాంటి ఫెసిలిటీస్? ఇదే ప్రశ్నించారు దీపికా పదుకొనే. ఒక్క దీపికానే కాదు. కొన్నేళ్లుగా ‘వాళ్లకెంతో తమకూ అంతే’ అనే గళం వినిపిస్తున్నారు కథానాయికలు. ఇన్ని ఫేస్ చేస్తూ.. ‘కాస్టింగ్ కౌచ్’ కూడా ఎదుర్కోవాలి. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష ఏ స్థాయిలో ఉంది. దాని వెనకున్న కారణాలేంటి? తెలుసుకుందాం. అభిప్రాయం చెప్పడంలో తప్పేం లేదుగా. ఎవరి ఇష్టం వాళ్లది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా దీపికా చాలా పద్దతిగానే ఆన్సర్ ఇచ్చింది. ‘కొన్నేళ్లుగా చాలామంది సీనియర్ హీరోస్ రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారు.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి