సల్మాన్ ఎంత మంచోడంటే..: మేఘా

మేఘా ఆకాష్‌.. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్నా, అదృష్టం కలిసి రావడం లేదు. మూడు సంవత్సరాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటివరకు ఏడు చిత్రాల్లో నటించింది.

  • Tv9 Telugu
  • Publish Date - 3:07 pm, Mon, 6 July 20
సల్మాన్ ఎంత మంచోడంటే..: మేఘా

మేఘా ఆకాష్‌.. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్నా, అదృష్టం కలిసి రావడం లేదు. మూడు సంవత్సరాల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటివరకు ఏడు చిత్రాల్లో నటించింది. అయితే అవేవీ పెద్దగా హిట్ అవ్వకపోగా.. ఆమెకు ఆఫర్లు కూడా సన్నగిల్లుతూ వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మేఘాకు పెద్ద ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్‌ నుంచి అని సమాచారం.

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్‌ రాధే అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం మేఘాను తీసుకున్నారు.ఇప్పటికే శాటిలైట్‌ శంకర్‌తో మేఘా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. సల్మాన్‌ మూవీలో ఆఫర్‌ వచ్చేసరికి ఈ నటి సంతోషం వ్యక్తం చేస్తోంది. దీనిపై మాట్లాడుతూ.. “ఇంతవరకు నేను చేసిన సినిమాలన్నింటికి రాధే విభిన్నం. సల్మాన్‌ పక్కన హీరోయిన్‌గా నేను నటించడం లేదు. ప్రభుదేవా నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా” అని తెలిపింది.

ఇక సల్మాన్‌ గురించి మాట్లాడుతూ.. “నేను ఆయనతో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన చాలా దయ గలిగిన వ్యక్తి. ఆయన బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్ గురించి ఓ రోజు మాట్లాడా. మరుసటి రోజే నాకు ఆయన బీయింగ్ హ్యూమన్ టీ షర్ట్ తీసుకొచ్చారు. సెట్స్‌లో ఉండే ప్రతి ఒక్కరి వివరాలను తెలుసుకొని గుర్తు పెట్టుకుంటారు. అందుకే ఆయనను చాలా మంది ఇష్టపడుతుంటారు” అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా కోసం దువ్వాడ జగన్నాథమ్‌లోని సిటీ మార్ పాటను రీమిక్స్ చేయబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి.