Manisharma: ‘నా పని నన్ను చేసుకొనివ్వట్లేదు’… ‘నారప్ప’ వీడియోపై మెలోడీ బ్రహ్మ అసహనం..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల

  • Rajitha Chanti
  • Publish Date - 2:36 pm, Sun, 17 January 21
Manisharma: 'నా పని నన్ను చేసుకొనివ్వట్లేదు'... 'నారప్ప' వీడియోపై మెలోడీ బ్రహ్మ అసహనం..

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నారప్ప. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ‘నారప్ప’ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఎవర్ గ్రీన్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా నారప్ప సినిమాకు సంబంధించి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని టీవీ 9కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

తన పాటలతో ఈ తరం యువతను కూడా కట్టిపడేస్తున్నారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఆయన పాటలే కాదు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పవచ్చు. అయితే అదే బ్యా్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైందట. తమిళంలో భారీ హిట్ సాధించిన అసురన్ రీమేక్‏గా తీస్తున్న చిత్రం నారప్ప. గతంలో ఈ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ విడుదలైంది. అయితే ఇందులో ఒరిజినల్ వెర్షన్ అసురన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏ను మణిశర్మ ప్రమేయం లేకుండానే యాడ్ చేసి విడుదల చేసారట మేకర్స్. అంతేకాకుండా అందులో మణిశర్మ పేరు కూడా వేశారట. దీంతో అసురన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‏ను మణిశర్మ కాపీ కొట్టాడని అందరూ అన్నారట. అప్పట్లో ఈ విషయం కాంట్రవర్సి అయ్యిందని తెలిపారు.

 

Also Read: ఫ్యాన్స్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ టీమ్‌ స్పెషల్‌ దీపావళి గిఫ్ట్‌.. సంప్రదాయ దుస్తుల్లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌, చెర్రీ