షూటింగ్ పూర్తి కాని రిషి చివరి చిత్రం.. దర్శకనిర్మాతలు ఏం చేయబోతున్నారంటే..!

గత రెండేళ్లుగా లుకేమియాతో బాధపడిన బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా క్యాన్సర్ బారిన పడకముందు ఈ నటుడు పలు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో శర్మా నమ్కీన్ ఒకటి. ఈ సినిమా 2018లోనే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఆ మధ్యన రిషి కపూర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకొని వచ్చిన తరువాత ఈ మూవీ షూటింగ్‌ను దర్శకనిర్మాతలు ప్రారంభించాలనుకున్నారు. అదే సమయంలో […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:35 pm, Sat, 2 May 20
షూటింగ్ పూర్తి కాని రిషి చివరి చిత్రం.. దర్శకనిర్మాతలు ఏం చేయబోతున్నారంటే..!

గత రెండేళ్లుగా లుకేమియాతో బాధపడిన బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా క్యాన్సర్ బారిన పడకముందు ఈ నటుడు పలు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో శర్మా నమ్కీన్ ఒకటి. ఈ సినిమా 2018లోనే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఆ మధ్యన రిషి కపూర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకొని వచ్చిన తరువాత ఈ మూవీ షూటింగ్‌ను దర్శకనిర్మాతలు ప్రారంభించాలనుకున్నారు. అదే సమయంలో రిషి కపూర్ సోదరి మరణించడంతో మళ్లీ వాయిదా పడింది. ఇక లాక్‌డౌన్ తరువాత మూవీ షూటింగ్‌ను చేయాలని భావించగా.. ఆయన ఆకస్మిక మరణంతో మూవీ యూనిట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

అయితే ఈ సినిమాను ఎలాగైనా పూర్తి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. దీంతో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని.. ఆ చిత్రాన్ని రిషి కపూర్‌కు అంకితం ఇవ్వాలని వారు అనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే.. రిషి కపూర్‌ను చివరిసారిగా తెరపై చూసే అవకాశం అందరికీ లభిస్తుంది.

Read This Story Also: Corona Warriors: గ్రాండ్ వెల్‌కమ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్.. వీడియో వైరల్‌