మహేష్‌కు బిగ్ షాక్.. మరీ ఇంత దారుణమా..! ఆడుకుంటోన్న యాంటీ ఫ్యాన్స్

మహేష్‌కు బిగ్ షాక్.. మరీ ఇంత దారుణమా..! ఆడుకుంటోన్న యాంటీ ఫ్యాన్స్

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో. కానీ ఇప్పుడు మహేష్‌కు బుల్లితెరపై ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన మహర్షి మూవీ ప్రీమియర్ ఇటీవల ఓ స్టార్ ఛానెల్‌లో ప్రసారం కాగా.. ఆ చిత్రానికి ఘోర టీఆర్పీ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా మహర్షికి 8.4 రేటింగ్ వచ్చింది. దీంతో సదరు ఛానెల్ యాజమాన్యం సహా.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 19, 2019 | 12:32 PM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్‌ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో. కానీ ఇప్పుడు మహేష్‌కు బుల్లితెరపై ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన మహర్షి మూవీ ప్రీమియర్ ఇటీవల ఓ స్టార్ ఛానెల్‌లో ప్రసారం కాగా.. ఆ చిత్రానికి ఘోర టీఆర్పీ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా మహర్షికి 8.4 రేటింగ్ వచ్చింది. దీంతో సదరు ఛానెల్ యాజమాన్యం సహా.. ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

అయితే మహేష్ ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ ఈ ఏడాది మేలో విడుదలైంది. యావరేజ్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. 100కోట్లకు పైగా షేర్ సాధించి హిట్ లిస్ట్‌లో చేరిపోయింది. రైతుల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా కావడంతో.. దీనికి టీఆర్పీ మంచిగా వస్తుందని ఛానెల్ యాజమాన్యం ఊహించింది. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ దారుణ రేటింగ్ రావడం ఫ్యాన్స్‌ను కూడా ఇబ్బంది పెడుతోంది. ఓ స్టార్ హీరో సినిమాకు 10 లోపే రేటింగ్ రావడమేంటని వాళ్లు తల పట్టుకున్నారు. ఇక మహేష్ నటించిన కొన్ని చిత్రాలు వెండితెర మీద సరిగా ఆడకపోయినా.. బుల్లితెర మీద మంచి టీఆర్పీ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ‘అతడు’, ‘ఖలేజా’, ‘నేనొక్కడినే’ లాంటి సినిమాలు బుల్లితెరపై బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అలాంటిది ఆయన ప్రతిష్టాత్మక చిత్రానికి ఇలా రేటింగ్ రావడం ఫ్యాన్స్‌ను కూడా బాగా ఇబ్బంది పెడుతోంది.

అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. మహర్షి సినిమా విడుదలైన కొన్ని రోజులకే అమెజాన్‌లో రాగా.. అక్కడే చాలామంది చూశారు. అందుకే ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్‌కు పెద్ద రెస్పాన్స్ రాలేదంటున్నారు కొందరు. ఇదిలా ఉంటే ఈ రేటింగ్‌పై యాంటీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. మహేష్ స్టామినా ఇప్పుడు తెలిసిదంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలంకు కూడా ఊహించిన రేటింగ్ రాకపోగా.. అప్పుడు కూడా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెర్రీని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఇప్పటికివరకు టాప్ రేటింగ్ సాధించిన 10 మూవీలు ఏంటంటే

1. బాహుబలి 2(22.7) 2. మగధీర(22) 3. బాహుబలి(21.8) 4. డీజే(21.7) 5. ఫిదా(21.3) 6.శ్రీమంతుడు(21.1) 7.గీతా గోవిందం(20.8) 8. జనతా గ్యారేజ్(20.69) 9. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(20) 10. రంగస్థలం(19.5)

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu