‘సరిలేరు’టీమ్‌కు మహేష్ ‘నెవ్వరు బిఫోర్’ పార్టీ..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. గుర్తుండిపోయే మెగా సూపర్‌ ఈవెంట్‌గా నిర్వహించారు నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌ తరువాత మరో పార్టీ చేసుకుంది సరిలేరు టీమ్. ఈ మూవీ కచ్చితంగా హిట్ […]

'సరిలేరు'టీమ్‌కు మహేష్ 'నెవ్వరు బిఫోర్' పార్టీ..!
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 7:58 AM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. గుర్తుండిపోయే మెగా సూపర్‌ ఈవెంట్‌గా నిర్వహించారు నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌ తరువాత మరో పార్టీ చేసుకుంది సరిలేరు టీమ్. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తోన్న మహేష్ ఆయన సతీమణి నమత్ర శిరోద్కర్ సినిమాలో నటించిన వారికి పార్టీ ఇచ్చారు. రిలీజ్‌కు ముందే వీరు సక్సెస్ పార్టీని నిర్వహించుకున్నారు.

ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర, సినిమాలో నటించిన విజయశాంతి, రష్మిక, సంగీత, కౌముది, పల్లవి, తమన్నా, సంగత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. వీరితో పాటు మరో దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆయన కుమార్తె ఆద్య కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సినిమా బ్లాక్‌ బస్టర్ కాబోతుందంటూ సరిలేరుపై మరోసారి ధీమాను వ్యక్తం చేశారు. అయితే సాధారణంగా సినిమా విడుదలై సక్సెస్ అయిన తరువాత హీరోలు పార్టీలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమాపై నమ్మకంతో ముందుగానే పార్టీని ఇచ్చారు మహేష్. దీంతో ఈ మూవీపై ఆయన ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరిలేరు నీకెవ్వరు తెరకెక్కింది. ఇందులో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై మహేష్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో ఈ సారి ‘పెద్ద హిట్లు పక్కా’ అంటూ వారు లెక్కలేసుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

https://www.instagram.com/p/B693HoHDjL9/