‘లూసిఫర్‌’కు డైరెక్టర్ అతడేనట.. కన్ఫర్మ్ చేసిన చిరు..!

'లూసిఫర్‌'కు డైరెక్టర్ అతడేనట.. కన్ఫర్మ్ చేసిన చిరు..!

మలయాళంలో పెద్ద విజయం సాధించిన లూసిఫర్‌.. తెలుగులో రీమేక్‌ అవుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్‌ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకోగా.. ఇందులో చిరంజీవి నటించబోతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 10, 2020 | 12:05 PM

మలయాళంలో పెద్ద విజయం సాధించిన లూసిఫర్‌.. తెలుగులో రీమేక్‌ అవుతోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్‌ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకోగా.. ఇందులో చిరంజీవి నటించబోతున్నారు. ఇక ఈ రీమేక్‌కు దర్శకుడి లిస్ట్‌లో సుకుమార్, పరశురామ్‌, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, వివి వినాయక్‌.. ఇలా పలువురి పేర్లు వినిపించాయి. ఇక తాజాగా ఈ రీమేక్‌పై స్పష్టతను ఇచ్చేశారు చిరంజీవి.

సాహో దర్శకుడు సుజీత్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నట్లు చిరంజీవి వివరించారు. అంతేకాదు ఈ రీమేక్‌కు సంబంధించి తెలుగు స్క్రిప్ట్‌ను రాసుకురమ్మని తాను సుజీత్‌కు తెలిపినట్లు ఆయన తెలిపారు. దీంతో లూసిఫర్ రీమేక్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. కాగా రన్‌ రాజా రన్‌తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజీత్‌.. ఆ తరువాత ప్రభాస్‌తో సాహోను తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం అయినప్పటికీ.. ఆ సినిమాను సుజీత్‌ తెరకెక్కించిన తీరుకు చిరు ఫిదా అయ్యారట. అందుకే లూసిఫర్ రీమేక్‌కు సుజీత్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక లూసిఫర్ రీమేక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు లాక్‌డౌన్‌ తరువాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read This Story Also: శానిటైజర్‌ తాగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. పలు అనుమానాలు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu