లూసిఫ‌ర్ రీమేక్‌లో బోలెడన్ని మార్పులు ఉండనున్నాయట.. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా చేంజెస్ చేసాడట దర్శకుడు..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజాకార్య‌క్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

  • Rajeev Rayala
  • Publish Date - 7:20 am, Sun, 24 January 21
లూసిఫ‌ర్ రీమేక్‌లో బోలెడన్ని మార్పులు ఉండనున్నాయట.. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా చేంజెస్ చేసాడట దర్శకుడు..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజాకార్య‌క్రమాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఎన్వీ ప్ర‌సాద్-ఆర్ బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లో 153వ చిత్రంగా రానున్న ‘లూసిఫర్’ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది.

ఈ మెగా రీమేక్ ని తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ప్రొడ్యూసర్స్ సైతం ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా సిద్ధం చేసారని వెల్లడించారు. అయితే ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదని తెలుస్తోంది. మలయాళ మాతృకలోని ఆత్మను తీసుకొని తెలుగు నేటివిటికి, చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు మోహన్ రాజా.ఇక ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్.. ఈసారి రవితేజ డైరెక్టర్‏తో కలవనున్న జనసేనాని..