Vijay Devarakonda: ఆ ఘ‌న‌త సాధించిన తొలి సౌత్ ఇండియ‌న్ హీరో మ‌న రౌడీ బాయ్‌.. ఇంత‌కీ విష‌య‌మేంటంటే..

Vijay Devarakonda: లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాలో విజ‌య్ ఉన్నాడ‌న్న‌ విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు కానీ నేడు..

Vijay Devarakonda: ఆ ఘ‌న‌త సాధించిన తొలి సౌత్ ఇండియ‌న్ హీరో మ‌న రౌడీ బాయ్‌.. ఇంత‌కీ విష‌య‌మేంటంటే..
Vijay Devarakonda
Narender Vaitla

|

Jun 15, 2021 | 6:08 AM

Vijay Devarakonda: లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్ర ద్వారా వెండి తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాలో విజ‌య్ ఉన్నాడ‌న్న‌ విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు కానీ నేడు.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడీ రౌడీ బాయ్‌. ఓవైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు వ్యాపారంలోనూ దూసుకుపోతున్నాడు.

ఇక తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో లైగ‌ర్ చిత్రంతో బాలీవుడ్‌లో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మ‌య్యాడు విజ‌య్‌. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ‌లేని క్రేజ్ సంపాదించుకున్న విజ‌య్ తాజాగా.. ఇండియా సెకండ్‌ మోస్ట్ డిజైర‌బుల్ మ్యాన్ 2020 టైటిల్‌ను గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మ‌రో అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీల‌తో ఏటా క్యాలెండ‌ర్ విడుద‌ల చేసే డ‌బూ ర‌త్నాని తాజాగా విజ‌య్‌ని కూడా త‌న కెమెరాలో బంధించాడు. 2020-2021 క్యాలెండ‌ర్‌లో క‌నిపించిన తొలి సౌత్ ఇండియన్ న‌టుడిగా విజ‌య్ పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. స్టైలిష్ లుక్‌లో బైక్‌పై దిగిన ఫొటోను చూసి ఆయ‌న అభిమానులు ఫిదా అవుతున్నారు. మ‌రి లైగ‌ర్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేద్దామ‌నుకుంటున్న విజ‌య్‌కి ఈ సినిమా ఏ మేర ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: RGV : ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టులో బ్రేకు.! దిశ ఎన్ కౌంటర్ సినిమా విడుదలను 2 వారాలు ఆపాలని ఆదేశం

Anil Ravipudi : బాలయ్య బాబు కోసం ‘రామారావుగారు’ సబ్జెక్ట్‌ ను సిద్ధం చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

Salaar Movie: సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్.. చకచకా సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu