AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరు దేవుడు.? ఎవరు బండ.? నటుడు రంగనాథ్ చెప్పిన ఈ కథ మనసును తట్టి లేపుతుంది

తెలుగు సినిమా పై ఎంతో మంచి నటీ నటులు చెరగని ముద్ర వేశారు. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు. తన నటనతో ఎలాంటి పాత్రలైనా యిట్టే ఒదిగిపోతారు ఆయన. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అలరించారు. హీరోల తండ్రిగా అద్బుతమైన నటన చూపించారు.

ఎవరు దేవుడు.? ఎవరు బండ.? నటుడు రంగనాథ్ చెప్పిన ఈ కథ మనసును తట్టి లేపుతుంది
Tollywood News
Rajeev Rayala
|

Updated on: May 24, 2026 | 9:39 AM

Share

ఒకప్పటి నటుల్లో తనదైన ముద్ర వేసిన నటుడు రంగనాథ్. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే నటుడు రంగనాథ్. ఎక్కువగా సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు రంగనాథ్.. 1974లో ‘చందన’ సినిమాతో రంగనాథ్‌కు హీరోగా అవకాశం లభించింది. అనంతరం దాదాపు 40 నుంచి 50 చిత్రాల్లో కథానాయకుడిగా చేశారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. దాదాపు దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు రంగనాథ్. వరుస సినిమాలు, సీరియల్స్ తో దూసుకుపోతున్న రంగనాథ్.. 2015లో రంగనాథ్ ఊహించని రీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లో సీలింగ్ హుక్‌కు ఉరివేసుకుని జీవితాన్ని ముగించారు. అంతే కాదు పిల్లలు ఉన్నప్పటికీ ఆయన ఆస్తి మొత్తం పనిమనిషికి రాసిచ్చారు.

రంగనాథ్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు, కవితలతో ఎందరినో అలరించారు. ఓ సినిమా కూడా డైరెక్ట్ చేశారు. కాగా రంగనాథ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో అద్భుతమైన కవితను వివరించారు. ఆ కవితలో ఎంతో అద్భుతమైన కథ, నీతి ఉన్నాయి. అదేంటంటే.. “అదేదో ఊరి నుంచి మహా శిల్పి వచ్చాడు.. మరేదో ఊరి న ఉంచి పెద్ద బండ తెచ్చాడు.. దానిని ఆరడుగుల కొలతకు బండను ఖండించాడు.. మిగిలిన మూడు అడుగుల ముక్కను ముక్కను పక్కకు తోసేశాడు. ఆరడుగుల బండ విగ్రహమై వెలిసింది, మూడడుగుల ముక్క బండ చాకిరేవును చేరింది”.

“కంపు కంపు మనసులన్నీ దేవుడి ఎదుట నిలిచాయి. కంపుగొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్థంతో తడిశాయి.. మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి. అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తితో శ్రద్ధలు.. చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు.. శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతుంది. పవిత్రతకై ప్రతి బట్టా బండను బాదబడింది. గుడి నుంచి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి.. రేవు నుంచి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుడిలోని దేవుడా? రేవులోని బండా? ఎవరు దేవుడు? ఎవరు బండ?” అంటూ కవితను ముగించారు రంగనాథ్. ఈ కవితలో ఎంతో లోతైన అర్ధం ఉంది. ఈ కవిత అందులోని కథ ఎంతో మందిని ఆలోజింప చేసింది. కవితలో రంగనాథ్ గారు చెప్పే ప్రధానాంశం ఏంటంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఏ దేవుడూ స్వయంగా దిగిరాడు. మనకు సహాయం చేయడానికి మనలాంటి ఒక మనిషే వస్తాడు. నిన్ను ఆదుకోవడానికి చేయి చాచేవాడు, నీ ఆకలి తీర్చేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు.. వీరంతా నీ కళ్ళముందు కనిపిస్తున్న నడిచే దేవుళ్ళు. ఎదుటి మనిషి బాధను చూసి కరిగిపోయే గుణం ఉన్న ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us