తెలుగులో రాణించకపోయిన ఈ భామ బాలీవుడ్ లో బాగానే సెటిల్ అయ్యిందిగా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి కర్బందా

టాలీవుడ్ లో పాగావేయడం అంత సులువేమి కాదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ఇతరభాషలనుంచి టాలీవుడ్ కు వచ్చి రెండుమూడు..

తెలుగులో రాణించకపోయిన ఈ భామ బాలీవుడ్ లో బాగానే సెటిల్ అయ్యిందిగా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతి కర్బందా
Follow us

|

Updated on: Dec 28, 2020 | 4:28 PM

టాప్ హీరోయిన్ గా  టాలీవుడ్ లో పాగావేయడం అంత సులువేమి కాదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ఇతరభాషల నుంచి టాలీవుడ్ కు వచ్చి రెండు మూడు సినిమాలు చేసి మళ్ళీ సొంతగూటికే చెక్కేసిన భామలు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా ఉంది. ఆ వయ్యారి ఎవరోకాదు. 2009లో ‘బోణి’ అనే తెలుగు సినిమాతో కృతి కర్బందా. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘తీన్మార్’ అనే సినిమా చేసింది. ఆతర్వాత రామ్ సరసన ‘ఒంగోలు గిత్త’ సినిమాలో మెరిసింది ఈ చిన్నది. చివరిగా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో అక్కగా కనిపించింది. ఈ అమ్మడు హీరోయిన్ గా చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.  దాంతో ఈ ముద్దుగుమ్మ పెట్టాబేడా సర్దుకొని బాలీవుడ్ కు చెక్కేసింది. బాలీవుడ్ లో మాత్రం ఈ చిన్నది అందాల హద్దులు చెరిపేసింది. గ్లామర్ షో తో రెచ్చిపోయింది. ఇటీవలే హిందీలో ‘పాగల్ పంతి’ ‘హౌస్ ఫుల్-4’ సినిమాలతో హిట్స్  అందుకుంది. అక్కడ ఈ కుర్రదానికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది కృతి. ప్రస్తుతం కృతి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా హిట్ అయ్యాయంటే కృతి హిందీలో సెటిల్ అయిపోయినట్టే.. మరి ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉందో చూడాలి.