Kollywood: పేరు ముందు స్టార్ ట్యాగ్స్ కట్..! కోలీవుడ్ హీరోలకు ఎందుకీ విరక్తి..?

| Edited By: Janardhan Veluru

Dec 14, 2024 | 11:57 AM

గతంలో ప్రతి హీరోకు ఓ స్టార్ ట్యాగ్ ఉండేది. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌ పోజిషన్‌ లో ఉన్న స్టార్‌ హీరోల తమ పేర్ల ముందు స్టార్‌ ట్యాగ్‌ లు కట్ చేస్తున్నారు. స్టార్ ట్యాగులు వద్దని కోరుకుతున్నారు. అభిమానులను తమ సొంత పేర్లతో పిలిస్తే చాలు, అనవసరమైన స్టార్ ట్యాగ్‌ లు యాడ్ చేయవద్దని కోరుతున్నారు.

Kollywood: పేరు ముందు స్టార్ ట్యాగ్స్ కట్..! కోలీవుడ్ హీరోలకు ఎందుకీ విరక్తి..?
Ajith Kumar, Kamal Haasan
Follow us on

అభిమానుల తమ ఫేవరెట్ యాక్టర్స్‌ ను స్టార్‌ ట్యాగ్‌ లతో పిలుచుకోవటం అన్నది దక్షిణాదిలో చాలా కాలంగా ఉన్న ఆనవాయితీ. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ తమిళ్‌ లో ఎమ్జీఆర్‌, శివాజీ గణేషణ్ లాంటి వారిని కూడా స్టార్‌ ట్యాగులతో పిలిచే వారు. ఆ తరువాత ప్రతీ జనరేషన్‌ లోనూ దాదాపు అందరు హీరోలకు ఏదో ఒక స్టార్ నేమ్ యాడ్ అవుతూనే ఉంది.

కానీ ప్రస్తుతం టాప్‌ పోజిషన్‌ లో ఉన్న స్టార్‌ హీరోల తమ పేర్ల ముందు స్టార్‌ ట్యాగ్‌ లు యాడ్ చేయోద్దంటున్నారు. అభిమానులను తమ సొంత పేర్లతో పిలిస్తే చాలు, అనవసరమైన స్టార్ ట్యాగ్‌ లు యాడ్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయమై మీడియా కూడా తమకు స్టార్ ట్యాగ్స్ వాడొద్దని కోరుతున్నారు.

తాజాగా అజిత్‌ తనను తల అని పిలవొద్దంటూ మరోసారి అభిమానులను కోరారు. తనకు అలా పిలిపించుకోవటం నచ్చదని, ఏదో ఇబ్బందిగా అనిపిస్తుందంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. అభిమానులు, తనను ప్రేమించే వాళ్లు, అజిత్, అజిత్‌ కుమార్‌, ఏకే అని పిలిస్తే చాలంటూ నోట్ రిలీజ్ చేశారు. గతంలో తన మేనేజర్ ద్వారా మీడియాకు అజిత్ ఇదే రిక్వెస్ట్ పంపించారు

ఈ మధ్య కమల్‌ హాసన్‌ కూడా ఇలాంటి డెసిషనే తీసుకున్నారు. ఇండియన్ సినిమాను కొత్త హైట్స్‌ కు తీసుకెళ్లిన కమల్‌ ను ఉలగనాయగన్‌ అంటూ పిలుచుకుంటారు అభిమానులు. అదే పేరును ఇతర భాషల్లో అనువధించి యూనివర్సల్‌ స్టార్‌, లోకనాయకుడు అంటూ టైటిల్స్‌ లో కమల్‌ ను పరిచయం చేస్తూ ఉంటారు మేకర్స్‌. కానీ ఇక మీదట అలాంటి ట్యాగ్స్‌ వద్దని కమల్ కోరారు. కేవలం పేరుతోనే పిలవాలని స్యయంగా కమలే కోరటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు.

మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా స్టార్‌ ట్యాగ్‌ లకు దూరంగానే ఉంటున్నారు. తమిళనాట స్టార్ స్టేటస్‌ ఎంజాయ్ చేస్తున్న సూర్యకు గతంలో నడిప్పిన్ నాయగన్ అన్న ట్యాగ్ ఇచ్చారు ఫ్యాన్స్‌. కానీ సూర్య మాత్రం తన సినిమాల టైటిల్స్‌ లో ఎప్పుడూ ఆ ట్యాగ్‌ ను వాడలేదు. రీసెంట్‌ గా ఓ ఈవెంట్‌ లో కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ అని పిలిస్తే.. తాను సూపర్‌ స్టార్‌ ని కాదని.. తమిళనాట ఒక్కరే సూపర్‌ స్టార్‌ అది రజనీకాంత్‌ మాత్రమే అన్నారు.

మిగతా అన్ని భాషల్లో హీరోలు కొత్త కొత్త ట్యాగ్‌ లు వెతికి మరీ పేర్ల ముందు యాడ్ చేసుకుంటుంటే, తమిళ హీరోలు మాత్రం ఆల్రెడీ ఉన్న ట్యాగ్‌ లను కూడా వద్దనుకుంటున్నారు. వాళ్లు మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.