రానాకు కిడ్నీ మార్పిడి తప్పనిసరా..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా ఆరోగ్యంపై మరోసారి వదంతులు గుప్పుమన్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో రానా బాధపడుతున్నాడని.. అతడి మూత్రపిండాలను మార్పిడి చేయాలని టాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. అంతేకాదు రానాకు కిడ్నీ ఇచ్చేందుకు అతడి తల్లి ముందుకొచ్చిందని కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రానాకు ఎలాంటి మార్పిడి అవసరం లేదని తెలుస్తోంది. రానా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నది నిజమేనని, కానీ ఎలాంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని సమాచారం. ప్రత్యేక వైద్యుల […]

రానాకు కిడ్నీ మార్పిడి తప్పనిసరా..!
Follow us

| Edited By:

Updated on: Feb 26, 2019 | 1:09 PM

ప్రముఖ టాలీవుడ్ నటుడు రానా ఆరోగ్యంపై మరోసారి వదంతులు గుప్పుమన్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో రానా బాధపడుతున్నాడని.. అతడి మూత్రపిండాలను మార్పిడి చేయాలని టాలీవుడ్‌లో వార్తలు వినిపించాయి. అంతేకాదు రానాకు కిడ్నీ ఇచ్చేందుకు అతడి తల్లి ముందుకొచ్చిందని కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రానాకు ఎలాంటి మార్పిడి అవసరం లేదని తెలుస్తోంది.

రానా మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నది నిజమేనని, కానీ ఎలాంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని సమాచారం. ప్రత్యేక వైద్యుల సమక్షంలో రానా తరచుగా పరీక్షలు చేయించుకుంటూ వారు చెప్పినట్లు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాడని తెలుస్తోంది. అందుకే ఎలాంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం లేదని డాక్టర్లు సూచించినట్లు టాక్. అయితే సినిమాల కోసం రానా చేసిన ప్రయోగాలు, అలాగే కొన్ని అలవాట్లు ఆయన ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపాయి. దీంతోనే రానా కిడ్నీలు దెబ్బతిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం రానా 1945, హాథీ మేరీ సాథీ సినిమాలలో నటిస్తున్నాడు.