‘ఆర్ఆర్ఆర్’ వాయిదా.. రంగంలో ‘కేజీఎఫ్ 2’..?

ముందుగా ఊహించినట్లుగానే ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేది వాయిదా పడింది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 8, 2021న ఆర్ఆర్ఆర్‌ రాబోతోంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ జూలై రేసు నుంచి ఆర్ఆర్ఆర్‌ తప్పుకోవడంతో.. ఇప్పుడు మిగిలిన హీరోలు ఆ డేట్‌పై కన్నేశారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియా సినీ […]

'ఆర్ఆర్ఆర్' వాయిదా.. రంగంలో 'కేజీఎఫ్ 2'..?

ముందుగా ఊహించినట్లుగానే ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్‌ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేది వాయిదా పడింది. దీనిపై బుధవారం అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 8, 2021న ఆర్ఆర్ఆర్‌ రాబోతోంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ జూలై రేసు నుంచి ఆర్ఆర్ఆర్‌ తప్పుకోవడంతో.. ఇప్పుడు మిగిలిన హీరోలు ఆ డేట్‌పై కన్నేశారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండియా సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్ 2’. యశ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మొదటి భాగం అన్ని భాషల్లో ఘన విజయం సాధించడంతో.. రెండో భాగంపై అన్ని ఇండస్ట్రీల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రెండో భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ గానీ డిసెంబర్‌లో గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ముందుగానే రావాలని కేజీఎఫ్ 2 టీమ్ భావిస్తుందట. ఈ క్రమంలో జూలై 30ని విడుదల తేదీగా ఫిక్స్ చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. త్వరలోనే టీజర్ విడుదల కానుంది.

ఇదిలా ఉంటే మొదటి భాగం ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచే రెండో భాగం మొదలుకానుంది. ఇక ఈ భాగంలో బాలీవుడ్ నటీనటులు సంజయ్, రవీనా టండన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్‌ను విజయ్ కిరుగంధర్ నిర్మిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

Published On - 9:10 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu