Katrina Kaif : ఈ సారి కత్రినా కైఫ్.. ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఆ సినిమాలో

ప్రభాస్ మూవీ కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్,ప్రాజెక్ట్ కే ఇలా వరుసగా భారీ సినిమాలను..

Katrina Kaif : ఈ సారి కత్రినా కైఫ్.. ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.. ఆ సినిమాలో
Katrina Kaif
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2021 | 8:36 AM

Katrina Kaif : ప్రభాస్ మూవీ కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్,ప్రాజెక్ట్ కే ఇలా వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ లను పూర్తిచేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్  పూర్తయ్యింది. ఇప్పుడు సలార్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ సినిమాల గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ను కూడా రంగంలోకి దింపుతున్నాడు ప్రశాంత్ నీల్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదిరిపోయే ఎలివేషన్స్ తోపాటు మాస్ ఆడియన్స్ ను ఊపేసే ఒక మసాలా సాంగ్ ఉందట.

ఈ పాటలో నటించే హీరోయిన్ కోసం చాలామంది పేర్లను పరిశీలించిన ప్రశాంత్ నీల్. ఫైనల్ గా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ఓటేశాడట. ఈ పాట కోసం కత్రినా కైఫ్ను అనుకుంటున్నారట. ఇప్పటికే కత్రినాను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. గతంలో వెంకటేష్, బాలకృష్ణ నటించిన సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కత్రినా. ఇప్పుడు ఇలా మరోసారి తెలుగు సినిమాలో మెరవబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కత్రినా నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral Video: పామే కదా అని ఆడిద్దామనుకున్నాడు..ఒళ్ళుమండిన పాము ఏం చేసిందో చూశారంటే పొట్టచెక్కలవడం ఖాయం!

కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి..

Exams In Telangana: తెలంగాణలో మొదలైన పరీక్షల సందడి.. ఈ నెలంతా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌తో బిజీ బిజీ..