Karthika Deepam Serial : దీప శాడిస్ట్ గా మారింది అంటూ.. మోనిత కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కార్తీక్.. నెక్ట్ ఏంటి..?

సరోజతో మాట్లాడుతున్న కార్తీక్ నిజంగా దీప ఎక్కడికి వెల్లిందో చెప్పలేదా.. లేక మాకు చెప్పొద్దూ అని అందా అంటాడు. దీంతో సరోజ మీరు వస్తారని ఆశ దీపకి ఉంటె తను ఇక్కడే ఉండేదిగా...

Karthika Deepam Serial : దీప శాడిస్ట్ గా మారింది అంటూ.. మోనిత కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కార్తీక్.. నెక్ట్ ఏంటి..?
Follow us

|

Updated on: Mar 11, 2021 | 10:45 AM

Karthika Deepam Serial : తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఫేవరేట్ సీరియల్ కార్తీక్ దీపం రోజుకో ట్విస్ట్ తో సాగుతుంది. ఈ రోజు 983 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. మూడేళ్లకు పైగా వస్తున్న ఈ ధారావాహిక ఇప్పటికీ తన ఆదరణను కోల్పోలేదు. టాప్ రేటింగ్ లో కొనసాగుతూనే ఉంది. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం..!

సరోజతో మాట్లాడుతున్న కార్తీక్ నిజంగా దీప ఎక్కడికి వెల్లిందో చెప్పలేదా.. లేక మాకు చెప్పొద్దూ అని అందా అంటాడు. దీంతో సరోజ మీరు వస్తారని ఆశ దీపకి ఉంటె తను ఇక్కడే ఉండేదిగా డాక్టర్ బాబు.. నాకు కూడా తెలియదు ఎక్కడికి వెల్లిందో.. అయినా మీరు కరిగేరకం కాదుగా అంటూ దెప్పుతుంది. దీంతో కార్తీక్ నన్ను రాక్షసుడిగా చేసి మాట్లాడుతున్నావ్ సరోజ అనేసరికి.. తప్పైపోయింది.. మీరు పెద్ద పేరున్న డాక్టర్.. అయినా మీ అమ్మగారు అన్నట్లు మీరు దేశోద్ధారకులే అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతుంది.

దీంతో నిరాశగా అక్కడ నుంచి వెనుదిరిగి… బలభద్రపురం చేరుకుని తనకు శౌర్య పరిచయం అయినా ప్లేస్ ల్లో వేడుకుతాడు.. ఇంతలో టిఫిన్ సెంటర్ పెట్టనికి బండిని రెడీ చేస్తుంటాడు వారణాసి.. ఇద్దరు పిల్లలు వచ్చి సాయం చేయబోతుంటే.. వద్దమ్మ అమ్మ చూస్తే నన్ను తిడుతుంది అంటాడు వారణాసి. ఇంతలో దీప కూడా వచ్చి.. బండిని శుభ్రం చేయడానికి సాయం చేస్తుంది.. అప్పుడు హిమ నువ్వు క్యారేజీ లు వేసినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ… ఇప్పుడు ఇడ్లీ అమ్ముతాను అంటే ఏదోలా ఉంది అమ్మా అని అంటుంది. అప్పుడు దీప తప్పులేదమ్మ.. మనం ఆకలితో లేకుండా ఉండడానికి పదిమంది ఆకలి తీరితే తప్పులేదంటుంది.

అయినా ఎప్పటిలాగే మనం అక్కడే వేరే ఇంట్లో ఉండే సరిపోయేదిగా వేరే ఊరు ఎందుకొచ్చామని శౌర్య ప్రశ్నిస్తుంది. దీంతో మీ నాన్నా ఇక మారదు.. మారతాడన్న ఆశలేదు.. సో ఉన్న యూరులోనే పరాయివారిగా బతికే కంటే. పరాయి ఊరునే సొంత ఊరు అనుకోవడం మంచిది అంటుంది దీప అయితే ఇక ఎప్పటికీ నాన్నా రాడాఅని శౌర్య అడుగుతుంది. పదేళ్లు ఎదురు చూసా రాలేదు.. ఇక వస్తాడన్న ఆశలేదు.. అయినా నాది, నీది ఫోన్ నెంబర్లు మార్చేశా అని చెప్పి కన్నీరు పెడుతుంది దీప.

ఇక మోనిత ఏంతో సంతోషంగా ప్రియమణితో మాట్లాడుతుంది. దీప ఎక్కడికో పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయిందట. అంటూ సంతోషంగా ఇద్దరు మాట్లాడుకుంటుంటే.. కార్తీక్ వస్తాడు. దీప ఎక్కడికో వెళ్ళిపోయింది. పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని నాకు హిమ కావాలి.. చిత్రం గా శౌర్య కూడా గుర్తుకొస్తుంది అంటాడు కార్తీక్. హిమకి నువ్వు అంటే ప్రాణం.. తను ఎక్కడికి వెళ్ళదు వస్తుంది ని కార్తీక్ కి నచ్చచెబుతుంది. హిమ వాళ్లతో వెళ్ళిపోయింది. నాన్నా కావాలి అని అనలేదు.. ఒక్క ఫోన్ కూడా చేయలేదు.. ఎలా మారిపోయింది నా బిడ్డ అంటూ కన్నీరు పెట్టుకుంటాడు కార్తీక్.

దీప ఎందుకు ఇలా చేసింది.. నేను పిల్లల కోసమైనా తనతో కలుస్తాను అనుకుని ఇలా చేసిందా లేక నిజంగానే ఇక నేను మారాను అని విరక్తితో వెళ్లిపోయిందా అంటూ మోనితతో తన బాధను పంచుకుంటాడు కార్తీక్.. అయితే మోనిత ఎప్పటిలాగే ఈ అవకాశాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకుంది. దీంతో కార్తీక్ మోనిత కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నా హిమనీ తీసుకుని వచ్చి నాకు ఇస్తే.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు. దీంతో మోనిత చాలా సంతోష పడుతుంది. ప్రియమణి తో సెలబ్రేట్ చేసుకుంది.

ఇక శౌర్య వాళ్ళ నాన్నకు ఫోన్ చేయాలనీ భావిస్తుంది.. ఫోన్ తీసుకుని డైల్ చేయబోతుంటే.. ఇంతలో హిమ వచ్చి .. ఎం చేస్తున్నావు శౌర్య.. నాన్న గుర్తుకొస్తున్నాడా.. నాన్నని చూడాలని ఉందా అని అంటుంది. మరి అయితే అమ్మ మనం వచ్చేటప్పుడు చెప్పిందిగా.. అమ్మ కావాలి అంటే నాన్న ఉండదు.. నాన్న కావాలంటే అమ్మ ఉండదు.. ఎవరినోకరిని ఎంచుకోండి అని.. మరి ఇప్పుడు ఇలా.. అయినా పాపం అమ్మ.. మన కోసం అమ్మ ఎంత కష్టపడుతుంది. ఇడ్లీ బండి పెట్టుకుని సంపాదించాలను కుంటుంది అని అమ్మ కష్టాన్ని శౌర్యకు గుర్తు చేస్తుంది. దీంతో శౌర్య రీలైజ్ అవుతుంది. అయినా వారణాసి చెప్పాడుగా మనం అమ్మతో ఉన్నాం కనుక అమ్మ దైర్యంగా ఉంది.. లేక పొతే అమ్మ ఏమౌతుంది.. అయినా ఇప్పుడు నాన్నకు మనం ఎక్కడ ఉన్నామో చెబితే.. తను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు.. అప్పుడు అమ్మ నేను వద్దా శౌర్యా అని ప్రశ్నిస్తుంది. దీంతో శౌర్య కన్నీరు పెట్టుకుని నేను ఆలోచించి వేరు.. అయినా ఇంత దూరం ఆలోచించలేదని బాధపడుతుంది. అయితే ఇప్పుడు మోనిత రంగంలోకి దిగి కార్తీక్ కోరిక ప్రకారం హిమనీ తీసుకుని వస్తుందా.. దీప పిల్లలు ఎక్కడ ఉన్నారో కనిపెడుతుందా.. హిమనీ తీసుకొస్తే.. ఇచ్చిన మాట ప్రకారం మోనిత ని కార్తీక్ పెళ్లి చేసుకుంటాడా.. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి మరి

Also Read:

: పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు.. కిడ్నీ సమస్యను గుర్తించడమెలా?.. సమస్యకు పరిష్కారం ఏమిటీ..?