Karthika Deepam Serial : సౌందర్యకు విహారి విషయం చెప్పిన దీప.. చాటుగా విన్న మోనిత.. నెక్స్ట్ ఏంటి..?

తెలుగు లోగోళ్లలో సందడి చేస్తున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 971 వ ఎపిసోడ్ లోని ఎంటర్ అయ్యింది. ఈరోజు దీప అత్త సౌందర్యకు విహారి గురించి నిజం చెప్పడానికి ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో మోనిత కూడా...

Karthika Deepam Serial : సౌందర్యకు విహారి విషయం చెప్పిన దీప.. చాటుగా విన్న మోనిత.. నెక్స్ట్ ఏంటి..?
Surya Kala

|

Feb 24, 2021 | 9:49 AM

Karthika Deepam Serial : తెలుగు లోగోళ్లలో సందడి చేస్తున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 971 వ ఎపిసోడ్ లోని ఎంటర్ అయ్యింది. ఈరోజు దీప అత్త సౌందర్యకు విహారి గురించి నిజం చెప్పడానికి ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో మోనిత కూడా గుడిలోకి ఎంట్రీ ఇస్తుంది. మోనీత దేవుడికి పూజ చేసి తనకు కార్తీక్ కు పెళ్లి అయ్యేలా చూడాలి అని కోరుకుంటుంది.

మోనిత ప్రదక్షణలు చేస్తుండగా సౌందర్య కారు లో నుంచి దిగి.. దీపను గుడిలో వెతుకుతుంటే.. మోనిత సౌదర్యని చూసి.. వెటకారంగా గుడ్ మార్నింగ్ ఆంటీ.. ఏమిటి ఇక్కడ అని అడుగుతుంది. మోనిత కు సమాధానం చెబుతూ.. నువ్వు గుడికి రావడం ఏమిటి ఆశ్చర్యంగా పిచాశాచాలు గుడికి వస్తే కోరికలు తీరవు. సద్భుద్దితో ఇంకో జన్మ ఎత్తాలి.. ఇప్పుడు పోయి మళ్లీ జన్మెత్తి అప్పుడు ట్రై చెయ్.. ఆల్ ది బెస్ట్.. నేను పిశాచాలతో పెద్దగా మాట్లాడను అంటూ సౌందర్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ఇక శౌర్య హిమతో ఆదుకోవడానికి దింపమని తాతయ్య ను అడగా కార్తీక్ తాను దింపుతానని అంటాడు. అయితే శౌర్య రెడీ అవ్వడానికి వెళ్తుండగా.. కార్తీక్ శౌర్య మెడలోని తాయెత్తు గురించి అడుగుతాడు.. ఇది చాలా మహిమగలదని. బలబద్రాపురంలో అమ్మవారిదని చెబుతుంది. అంతేకాదు అమ్మా నాన్న నేను కలిసి ఉండాలని కోరుకున్నాను.. హిమ నా చెల్లి అని తెలిసి తెలియదు కదా.. ఇప్పుడైతే మొత్తం నలుగురం కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని చెబుతుంది. దీంతో తాతయ్య ఆనందరావు చూశావా.. మనమంతా దీన్ని రౌడీ పిల్ల అనుకుంటాం కానీ.. పిచ్చి పిల్ల.. ఎంత నమ్మకం లేకపోతే అమ్మా నాన్న కలవాలి అనుకుంటుంది?’ అని మురిసిపోతాడు

ఇక దీప గుడిలో అత్త సౌందర్యకు తులసి, విహారీకి పిల్లలు పుట్టారు అనే నిజాన్ని చెబుతుంది. దీంతో సౌందర్య ఎమోషనల్ అవుతూ ఇదే కదా నీ కాపురాన్ని నిలబెట్టే ఆధారం.. ఈ నిజాన్ని నువ్వు కార్తీక్‌తో చెప్పేస్తే మీ కాపురంలోని పొరపచ్చాలన్నీ తొలగిపోతాయి.. మళ్లీ నా కొడుకు మచ్చలేని చంద్రుడిగా మారిపోతాడని ఆనందపడిపోతుంది.

అయితే ఈ విషయం తాను కార్తీక్ కి చెప్పనని దీప అందంతో సౌందర్య షాక్ తింటుంది. విహారీకి పిల్లలు పుట్టరు అనే నిజం డాక్టర్ బాబుకి చెబితే.. నన్ను నా పిల్లల్ని హక్కున చేర్చుకుంటారు. కానీ నేను ఆ పని చేయలేను..’ అంటుంది దీప. ‘సాటి ఆడదాని కాపురాన్ని బయటపెట్టి నా కాపురాన్ని నిలబెట్టుకోలేను..’ అంటుంది దీప బాధగా.

దీంతో సౌందర్య కార్తీక్ ఎప్పటికీ డీఎన్‌ఏ చేయించుకోడు.. వాడికి వాడు పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదు చెక్ చేయించుకోడు.. మరి నీ కాపురం చక్కబడేది ఎలా.. అని ప్రశ్నిస్తుంది. అయితే ఒకరి శాపాన్ని నేను వరంగా మార్చుకోలేను అది నా వ్యక్తిత్వం కాదు అత్తయ్యా.. అంటుంది దీప.

దీంతో సౌందర్య దీపని తిడుతుంది.. నిజాయితీగా నిజం బయటపెట్టు.. వాడి మనసులో ఉన్న ఆ ఒక్క అనుమానం వాడి మనసులోంచి తుడిచెయ్..’ అని దీపని బతిమలాడుతుంది సౌందర్య.

‘నీ బిడ్డల భవిష్యత్ స్వర్గతుల్యమే అవుతుంది. అన్నింటికి మించి నువ్వు ప్రేమించే డాక్టర్ బాబు అంతకు మించిన ప్రేమతో నిన్ను ఆధరిస్తాడే.. అత్తగా కాదు.. అమ్మగా చెబుతున్నాను..అని సౌందర్య దీపని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటే.. మోనిత చాటుగా వినేస్తున్న సీన్‌తో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరో మోనిత విన్న తర్వాత ఎం చేస్తుంది.. దీప సౌందర్యలు ఏ నిర్ణయం తీసుకుంటారనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Also Read:

క్రిష్ మూవీలో కుస్తీ వీరులతో పోరాటానికి సిద్ధమైన రాబిన్ హుడ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‏ను మెప్పించిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఆ ఇద్దరి కాంబినేషన్‏లో త్వరలోనే సినిమా ? 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu