’’అమ్మాయిలు పైలెట్ అవ్వలేరు’’.. ‘గుంజన్ సక్సేనా’గా జాన్వీ ఫస్ట్‌లుక్

ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి శరన్ శర్మ దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్ లీడ్ రోల్‌లో నటించింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు మరో రెండు లుక్‌లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో జాన్వీ కపూర్ టీషర్ట్‌ వేసుకొని పేపర్ రాకెట్‌తో ఆడుకుంటున్నట్లు ఉండగా.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:15 pm, Thu, 29 August 19
’’అమ్మాయిలు పైలెట్ అవ్వలేరు’’.. ‘గుంజన్ సక్సేనా’గా జాన్వీ ఫస్ట్‌లుక్

ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి శరన్ శర్మ దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్ లీడ్ రోల్‌లో నటించింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు మరో రెండు లుక్‌లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో జాన్వీ కపూర్ టీషర్ట్‌ వేసుకొని పేపర్ రాకెట్‌తో ఆడుకుంటున్నట్లు ఉండగా.. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పోస్టర్‌లో అమ్మాయిలు పైలెట్‌లు అవ్వలేరు అనే కామెంట్‌ను కూడా పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది మార్చి 13న విడుదల కానుంది.

కాగా భారత మొదటి మహిళా పైలెట్‌గా పేరొందిన గుంజన్.. 1999 కార్గిల్ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆమె ధైర్యానికి మెచ్చి ప్రభుత్వం శౌర్యవీర్ అవార్డు కూడా అందించింది.