మహానాయకుడు పై కంగనా కామెంట్స్..!

మహానాయకుడు పై కంగనా కామెంట్స్..!

ముంబై: మణికర్ణిక సినిమాతో ఇటు నటిగా అటు దర్శకురాలి గా తనేంటో నిరూపించుకుంది కంగనా రనౌత్. అంతేకాదు సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య క్రిష్ కు, కంగనా కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రిష్ పై విరుచుకుపడింది కంగనా. క్రిష్ డైరెక్ట్ చేసిన ‘మహానాయకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమా కలెక్షన్స్ డల్ […]

Ravi Kiran

|

Feb 25, 2019 | 7:54 PM

ముంబై: మణికర్ణిక సినిమాతో ఇటు నటిగా అటు దర్శకురాలి గా తనేంటో నిరూపించుకుంది కంగనా రనౌత్. అంతేకాదు సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య క్రిష్ కు, కంగనా కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రిష్ పై విరుచుకుపడింది కంగనా. క్రిష్ డైరెక్ట్ చేసిన ‘మహానాయకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ ‘ ఈ సినిమా కలెక్షన్స్ డల్ గా ఉన్నాయని విన్నాను. క్రిష్ పై నమ్మకంతో సినిమా అప్పగించిన బాలకృష్ణ సర్ ను చూస్తుంటే బాధగా ఉందని’ ఆమె అన్నారు.

అంతేకాదు నన్ను మణికర్ణిక విషయంలో విమర్శించిన వారికి సమాధానం చెప్పే టైం వచ్చింది. నిర్మాణ సంక్షోభంలో ఉన్నప్పుడు.. నేను దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాను. అప్పుడు నాపై కొందరు మానసికంగా దాడి చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే మణికర్ణిక లాంటి యోధురాలి సినిమా విషయంలో క్రిష్ తో పాటు పెయిడ్ మీడియా దుష్ప్రచారానికి దిగాయి. ఇలాంటి కృతఘ్నుల కోసమా స్వాతంత్ర సమరయోధులు రక్తం చిందించింది అని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu