కంగనా, క్రిష్‌ల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్

కంగనా, క్రిష్‌ల మధ్య ముదురుతున్న సోషల్ మీడియా వార్

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి ప్రముఖ దర్శకుడు క్రిష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లోని రెండో భాగమైన ‘మహానాయకుడు’ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను అందుకుంటోంది. కాగా, కలెక్షన్లు రాబట్టడంలో ఈ చిత్రం వెనబడిందని సినీ వర్గాల ద్వారా తనకు తెలిసిందని కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇదే మంచి అవకాశమనుకుని క్రిష్‌పై కామెంట్లు చేశారు. […]

Ram Naramaneni

|

Feb 25, 2019 | 5:56 PM

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి ప్రముఖ దర్శకుడు క్రిష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లోని రెండో భాగమైన ‘మహానాయకుడు’ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను అందుకుంటోంది. కాగా, కలెక్షన్లు రాబట్టడంలో ఈ చిత్రం వెనబడిందని సినీ వర్గాల ద్వారా తనకు తెలిసిందని కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇదే మంచి అవకాశమనుకుని క్రిష్‌పై కామెంట్లు చేశారు.

‘‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి నేను విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఇప్పుడు చెప్పండి.. నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాంబదుల్లా నన్ను పీక్కుతిన్నారు. ఇప్పుడేమంటారు? బాధాకరమైన విషయం ఏంటంటే.. క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయి. మన స్వాతంత్ర సమరయోధులు (లక్ష్మీబాయిని ఉద్దేశిస్తూ) దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందినందుకు నాకు చాలా బాధగా ఉంది’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు కంగన.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu