పెళ్లా..? నాకా..? అప్పుడేనా..!

మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్ల లిస్ట్‌లో టాలీవుడ్ చందమామ కాజల్ ఒకరు. 12ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ పెళ్లి గురించి వార్తలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. పర్సనల్‌ విషయాలను మాత్రం కాజల్ సీక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తుంది. అందుకే ఆమె రిలేషన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి తక్కువ గాసిప్‌లే వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లి గురించి కాజల్‌కు […]

పెళ్లా..? నాకా..? అప్పుడేనా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 04, 2019 | 12:55 PM

మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్ల లిస్ట్‌లో టాలీవుడ్ చందమామ కాజల్ ఒకరు. 12ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ పెళ్లి గురించి వార్తలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. పర్సనల్‌ విషయాలను మాత్రం కాజల్ సీక్రెట్‌గా మెయిన్‌టెన్ చేస్తుంది. అందుకే ఆమె రిలేషన్స్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి తక్కువ గాసిప్‌లే వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లి గురించి కాజల్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చందమామను ఓ వ్యక్తి వివాహం గురించి ఓ ప్రశ్నను వేశాడు. దానికి వెంటనే స్పందించిన కాజల్.. ‘‘పెళ్లి గురించి ప్రస్తుతం నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. నా మనసుకు నచ్చినవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు దొరికితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా’’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ అమ్మడి ప్రస్తుత వయస్సు 34 సంవత్సరాలు కాగా.. అసలు కాజల్‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

కాగా 2017లో మంచి హిట్లనే తన ఖాతాలో వేసుకున్న కాజల్.. ఆ తరువాత రెండేళ్లుగా మంచి హిట్ లేక సతమతమవుతోంది. ఈ ఏడాది ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ‘సీత’, ‘రణరంగం’లు కూడా ఫ్లాప్ అవ్వడంతో.. ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు కరువవుతూ వస్తున్నాయి. ఇక కోలీవుడ్‌లో కాజల్ నటించిన పారిస్ పారిస్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రస్తుతం ఇండియన్ 2, ముంబయి సగ, కాల్ సెంటర్ అనే చిత్రాల్లో చందమామ నటిస్తోంది. వీటితో పాటు తమిళ్‌లో మరో వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu