జయలలిత బయోపిక్‌లో ‘జూనియర్ ఎన్టీఆర్’..?

దివంగత ‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అమ్మ అలియాస్ జయలలిత’పై బయోపిక్‌లు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. కంగనా రౌనౌత్ ప్రధాన పాత్రధారురాలిగా.. నటిస్తోన్న ‘తలైవి’. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీటిల్లో.. ‘తలైవి’ సినిమాకి సంబంధించిన విషయాలు ఎక్కువగా.. వార్తల్లో నిలుస్తోన్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ఒకటి అందరినీ ఆకర్షిస్తోంది. జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అటు రాజకీయంగానూ.. ఇటు నటన […]

  • Updated On - 6:52 pm, Wed, 20 November 19 Edited By:
జయలలిత బయోపిక్‌లో 'జూనియర్ ఎన్టీఆర్'..?

దివంగత ‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అమ్మ అలియాస్ జయలలిత’పై బయోపిక్‌లు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. కంగనా రౌనౌత్ ప్రధాన పాత్రధారురాలిగా.. నటిస్తోన్న ‘తలైవి’. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీటిల్లో.. ‘తలైవి’ సినిమాకి సంబంధించిన విషయాలు ఎక్కువగా.. వార్తల్లో నిలుస్తోన్నాయి.

కాగా.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ఒకటి అందరినీ ఆకర్షిస్తోంది. జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అటు రాజకీయంగానూ.. ఇటు నటన పరంగానూ..  ఆమె జీవితాన్ని.. తెరపై చూపించడం కష్టమే. నటనలో.. ఆమె చాలా మంది లెజెండ్రీ యాక్టర్స్‌తో నటించారు. అందులో ముఖ్యమైన వ్యక్తి.. ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఒకరు. ఇప్పుడు ఈ పాత్రకు తగ్గ వ్యక్తి.. జూనియర్ ఎన్టీఆర్ అని భావించిన చిత్ర యూనిట్.. ఆయనతో సంప్రదింపులు మొదలు పెట్టారట. దీనికి.. జూనియర్.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. మరి తాత పాత్రలో ఎన్టీఆర్ నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అయితే.. ఇంతకుముందే.. సావిత్రి బయోపిక్ అయిన.. ‘మహానటి’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించేందుకు జూనియర్‌ని అడగగా.. అతను నిరాకరించాడు. అలాగే.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో.. అంత పెద్ద లెజెండ్రీ యాక్టర్ ఎన్టీఆర్ పాత్రలో నేను నటించను.. నటించలేను అని కూడా తేల్చి చెప్పాడు. మరి చూడాలి.. ఈ చిత్ర యూనిట్‌కి ఏం సమాధానం చెబుతాడో.