Uppena Movie : ‘ఉప్పెన’ను మరింత హోరెతించనున్న యంగ్ టైగర్.. తారక్ వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌తో ట్రైలర్..!

సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్‌తేజ్‌, మంగ‌ళూరు భామ కృతిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతుంది....

Uppena Movie : 'ఉప్పెన'ను మరింత హోరెతించనున్న యంగ్ టైగర్.. తారక్ వాయిస్ ఓవర్‌‌‌‌‌‌‌తో ట్రైలర్..!
Follow us

|

Updated on: Feb 03, 2021 | 9:39 PM

Uppena Movie : సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్‌తేజ్‌, మంగ‌ళూరు భామ కృతిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతుంది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే రాంచ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు ఉప్పెన ప్ర‌మోషన్స్ లో భాగ‌స్వామ్యం అయ్యారు. తాజాగా మ‌రో స్టార్ హీరో ఉప్పెన ప్ర‌మోష‌న్స్ లో భాగం కాబోతున్నాడు. ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఉప్పెన సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్‌కు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారట. ఇప్పటికే  ఉప్పెన పాట‌లు యూట్యూబ్‌లో మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ హీరో.. పొలిటికల్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్.. టైటిల్ ఎంటంటే..