అందుకే ‘ఆర్ఆర్ఆర్’లో అతడిని తీసుకున్నా: రాజమౌళి

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

అందుకే 'ఆర్ఆర్ఆర్'లో అతడిని తీసుకున్నా: రాజమౌళి
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2020 | 7:45 AM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఫ్లాష్‌ బ్యాగ్ ఎపిసోడ్‌లో ఈయన కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అజయ్‌ను తీసుకోవడానికి గల కారణాలను రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

”ఈ సినిమాకు అజయ్‌ పాత్ర చాలా కీలకం. ఆయన పాత్ర చాలా బావుంటుంది. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట కూడా అంత నిజాయితీగా ఉంటారు. ఈ పాత్ర కోసం నటుడిలో ఉండాల్సిన లక్షణాలు, నా అవసరాలు కొంత మందికి చెప్పి, సలహా అడిగినప్పుడు.. పది మందిలో తొమ్మిది మంది అజయ్‌ పేరు చెప్పారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఇందులో నటించేందుకు ఆయన ఒప్పుకోవడం, తనకు చాలా సంతోషానిచ్చింది. ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారు” అని రాజమౌళి చెప్పుకొచ్చారు. కాగా రాజమౌళి తెరకెక్కించిన ఈగను హిందీలో డబ్ చేయగా.. అందులో అజయ్‌, కాజోల్ ఇద్దరు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు రాజమౌళితో అజయ్‌ పరోక్షంగా పనిచేయగా.. దాదాపు 8 సంవత్సరాల తరువాత ప్రత్యక్షంగా పనిచేస్తుండటం విశేషం. కాగా ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ పలు భారతీయ భాషల్లో విడుదల కానుండగా.. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: కీర్తి పెళ్లి పుకార్లు లీక్.. ఆ కమెడియన్ పనేనా..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!