Radhe Shyam: రాధేశ్యామ్‌ విడుదలపై కొనసాగుతోన్న సందిగ్ధత.. దర్శకుడి ట్వీట్‌కు అర్థం అదేనా.?

Radhe Shyam: రాధేశ్యామ్‌ విడుదలపై కొనసాగుతోన్న సందిగ్ధత.. దర్శకుడి ట్వీట్‌కు అర్థం అదేనా.?

Radhe Shyam: పరిస్థితులు చూస్తుంటే కోరనా మహమ్మారి మరోసారి విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కరోనా ప్రభావం..

Narender Vaitla

|

Jan 04, 2022 | 3:26 PM

Radhe Shyam: పరిస్థితులు చూస్తుంటే కోరనా మహమ్మారి మరోసారి విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవున్నట్లు కనిపిస్తోంది. పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక కరోనా ప్రభావం సినిమా పరిశ్రమపై మళ్లీ పడనుందా అంటే ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాతో అవుననే సమాధానం వస్తుంది. పలు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధిచండంతో ఒమిక్రాన్‌ కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతుండడంతో మేకర్స్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను వాయిదా వేశారు. దీంతో సంక్రాంతికి సందడి చేస్తుందని కోటి ఆశలతో ఉన్న సినీ ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అయితే రాధేశ్యామ్‌ రూపంలో మరో భారీ చిత్రం ఆ లోటును తీర్చనుందని కొంత సంతోషించారు. అయితే ఇప్పుడు ఈ సంతోషం కూడా ఆవిరి కానుందా.. అంటే అవుననే అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా రాధేశ్యామ్‌ చిత్ర దర్శకుడు చేసిన ఓ పోస్ట్‌ ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లైంది.

తాజాగా మంగళవారం రాధేశ్యామ్‌ దర్శకుడు రాధా క్రిష్ణ కుమార్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘సమయం చాలా కఠినంగా ఉంది. మనసులు బలహీనంగా మారాయి. మనసులో ఏదో అల్లకల్లోలంగా ఉంది. జీవితం మనపైకి వేటిని విసిరినా.. మన ఆశలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఆలోచించండి’ అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు రాధేశ్యామ్‌ టీమ్‌ను ట్యాగ్‌ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో సినిమా వాయిదా పడనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్‌ సినిమా వాయిదా పడనుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని కామెంట్ చేస్తూ.. ‘ఇన్‌ డైరెక్ట్‌గా పోస్ట్‌పోన్‌ అంటున్నావా అన్నా’ అని ప్రశ్నించగా, ‘అలాంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా అధికారికంగా చెబుతాం’ అని రిప్లై ఇచ్చాడు రాధా క్రిష్ణ. దీంతో ప్రేక్షకుల్లో గందరగోళం నెలకొంది. అసలు రాధేశ్యామ్‌ సంక్రాంతి వస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే రాధేశ్యామ్‌ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం కూడా నెట్టింట వైరల్‌గా మారింది. రాధేశ్యామ్‌ చిత్రం ఓటీటీ హక్కులను ఓ బడా సంస్థ ఏకంగా రూ. 400 కోట్లకు కొనుగోలు చేసిందని నెట్టింట వార్త వైరల్‌ అవుతోంది. ప్రముఖ సినిమా అనలిస్ట్‌ మనోబాలా విజయ్‌బాలన్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి రాధేశ్యామ్‌ విడుదల గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Jaggery Effects on Health: చలికాలంలో బెల్లం ఆరోగ్యానికి హానీకరం.. ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!

Smart Phone Tips: మొబైల్ నుంచి కూడా కరోనా ప్రమాదం.. ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసా..

Viral Video: ఓరి దీని ఏశాలో.. కుక్కను బకరా చేసిన బాతు.. ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చంతే..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu