‘రొమాంటిక్‌ సీన్లు’.. చిరంజీవికి తలనొప్పిగా మారాయా..?

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల వల్ల ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు కానీ.. ఆయన సినిమా వస్తే.. అభిమానులకు ఎంత పండుగో.. తాజాగా రిలీజ్‌ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’తో‌ రుజువైంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి థియేటర్‌పై కనిపించడంతో.. ఫ్యాన్స్ సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. మోగాస్టార్ ఈజ్‌ బ్యాక్.. అంటూ చిరు కటౌట్‌లకు పాలాభిషేకాలు చేసి భారీ పూల దండలు వేసి బ్రహ్మరథం పట్టారు అభిమానులు. అంతేకాకుండా.. […]

'రొమాంటిక్‌ సీన్లు'.. చిరంజీవికి తలనొప్పిగా మారాయా..?
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 14, 2019 | 4:58 PM

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. రాజకీయాల వల్ల ఆయన సినిమాలకి దూరంగా ఉన్నారు కానీ.. ఆయన సినిమా వస్తే.. అభిమానులకు ఎంత పండుగో.. తాజాగా రిలీజ్‌ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’తో‌ రుజువైంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి థియేటర్‌పై కనిపించడంతో.. ఫ్యాన్స్ సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. మోగాస్టార్ ఈజ్‌ బ్యాక్.. అంటూ చిరు కటౌట్‌లకు పాలాభిషేకాలు చేసి భారీ పూల దండలు వేసి బ్రహ్మరథం పట్టారు అభిమానులు. అంతేకాకుండా.. సైరా చిత్రం కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. పలు భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా.. చిరు కెరీర్‌లో మరో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దీంతో.. ఇప్పుడు చిరంజీవి వరుస పెట్టి సినిమాలకు సంతకాలు చేసేశారు. ఒకరి తర్వాత మరొక డైరెక్టర్ చిరుతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు మెగాస్టార్ పక్కన.. ఆడిపాడేందుకు మాత్రం హీరోయిన్ దొరకడం కష్టంగా మారిందట. ‘స్టాలిన్’ సినిమాలో త్రిషతో నటించినప్పుడే చాలా విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ సైరా సినిమాలో తనకంటే సగం వయసున్న హీరోయిన్లతో కలిసి నటిస్తున్నారు చిరు.

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లతో.. రొమాంటిక్ సీన్స్ చేయడానికి చిరుకి కాస్త ఇబ్బందిగా ఉందని అనిపిస్తోంది. అందులోనూ అటువంటి సీన్స్‌ తెరపై చూడటం కూడా.. ఫ్యాన్స్‌కు ఎబ్బెట్టుగా ఉందట. తాజాగా.. చిరు నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఇదే జరిగింది. చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు.. తమన్నా, నయన తార నటించారు. నయన్.. చిరు పక్కన కాస్త బెటర్ అనిపించింది. కానీ.. తమన్నా మాత్రం అస్సలు సూట్ కాలేదు. తెరపై చిరు, తమన్నా.. కాంబినేషన్ చూడటం కాస్త ఇబ్బందిగానే అనిపించిందని ఫ్యాన్స్ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అయితే.. సినిమాలో హీరోయిన్స్‌తో.. హీరోకి.. ఆట పాటలు కంపల్సరీగా ఉండాలి. సైరా సినిమాకి పాటలు అవసరం లేదు కాబట్టి.. ఓకే.. కానీ ఇప్పుడు చిరు వచ్చే సినిమాలకు ఖచ్చితంగా కావాలి. దీంతో కొరటాల తన సినిమాలో.. చిరంజీవి ప్లేస్‌లో రాంచరణ్‌ పెట్టి.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో సాంగ్స్ పెట్టి.. మిగతావి.. చిరంజీవితో కానిస్తారని సమాచారం. కానీ.. అన్ని సినిమాలకు ఈ స్ట్రాటజీ వర్క్‌అవుట్ అవ్వదు కదా. ఒకవేళ పాత హీరోయిన్స్‌ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తారో..! ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..