తెలుగు బుల్లితెర మీద విజయవంతంగా దూసుకుపోతున్న షోలలో బిగ్‌బాస్ 3 ఒకటి. ఇప్పటికీ ఏడు వారాలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక గత రాత్రి(08.09.19) జరిగిన ఎపిసోడ్లో అలీ రైజా ఎలిమినేట్ అవ్వడం బిగ్‌బాస్ వీక్షకులందరికీ పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. అతడు ఎలిమినేట్ అయ్యాడని తెలిసిన వెంటనే హౌస్‌లో ఉన్న వారు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాంకర్ శివజ్యోతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలీని తలచుకొని వెక్కివెక్కి ఏడ్చింది. కాగా ఇక ఈ ఎపిసోడ్లో అలీ రైజా ఎలిమినేట్ అవ్వడం చూస్తుంటే ఇదంతా స్క్రిప్టెడ్ అని అర్థమైందంటున్నారు కొందరు.
షో ప్రారంభం అయినప్పటి నుంచి మొదటిసారి ఎలిమినేషన్లోకి వచ్చిన అలీ.. అందులోనే ఎలిమినేట్ అయ్యి ఇంటిబాట పట్టాడు. అయితే అలీతో పాటు రాహుల్, మహేష్, రవికృష్ణ, శ్రీముఖి ఈ సారి ఎలిమినేషన్లో ఉన్నారు. వారందరిలో రాహుల్‌పై కాస్త నెగిటివ్ ఎక్కువగా ఉంది. దీంతో అందరూ రాహుల్ వెళ్లిపోతారని భావించారు. కానీ అనూహ్యంగా అలీని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని.. రాహుల్, పునర్నవి లవ్ ఎపిసోడ్‌ను క్యాష్ చేసుకునేందుకే నిర్వాహకులు అలీని ఇంటికి పంపేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే మరోవైపు ఇదంతా ట్రాష్ అంటున్నారు కొందరు. హౌస్‌లో కాస్త అగ్రెసివ్‌గా ఉండే వారిలో అలీ ఒకడు. దీంతో ఇతడిపై ముందునుంచే ఆడియెన్స్‌లో కొంచెం నెగిటివ్ ఉంది. కానీ ఇంతవరకు ఎలిమినేషన్‌కు రాకపోవడంతో అతడు సేఫ్‌గా ఉండిపోతూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఎలిమినేషన్ గ్రూప్‌లోకి రావడంతో.. అతడికి నెగిటివ్ ఓట్లు పడ్డాయని.. అందుకే ఎలిమినేట్ అయ్యాడని మరికొందరి వాదన. హౌస్‌లో కాస్త ఇబ్బందిగా ఉండేవారు, బాగా ఆడనివారినే ఇంతవరకు ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారన్నది వారి అభిప్రాయం.
ఇదంతా పక్కనపెడితే ఎలిమినేషన్లోకి మొదటిసారి వచ్చిన వ్యక్తి ఆ వారమే ఎలిమినేట్ అవ్వడం బిగ్‌బాస్‌లో కొత్తేం కాదు. ముఖ్యంగా ఈ సీజన్లో తమన్నా, రోహిణి, అషు రెడ్డి.. వీళ్లంతా ఎలిమినేషన్ అయిన మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఎలిమినేట్ అయిన తరువాత అలీ రైజా సైతం చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బాస్ స్క్రిప్ట్ పరంగా నడవదన్నది కొందరి మాట. ఏదేమైనా అలీ రైజా ఎలిమినేట్ అవ్వడంపై నెటిజన్లు కూడా ఓ రేంజ్లో ట్వీట్లు వేస్తున్నారు. బిగ్‌బాస్‌ను చూడకండి అంటూ తమ అభిప్రాయాలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.