AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singeetham: 94 ఏళ్ల ప్రయోగశాల.. పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!

టాలీవుడ్డే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే డైరెక్టర్లలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. సినిమాల్లో ఈయన చేసిన ప్రయోగాలు మరే డైరెక్టర్ చేసి ఉండరేమో. .. 'ఆదిత్య 369', 'పుష్పక విమానం', 'మయూరి' , 'భైరవ ద్వీపం' వంటి ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు.

Singeetham: 94 ఏళ్ల ప్రయోగశాల.. పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
Singeetham Srinivasa Rao Sing Geetham Movie
Praveen Vadla
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 5:29 PM

Share

‘పాతికేళ్లకే పాతబడిపోతే ఎట్టా.. ఏదైనా ఈ భూమ్మీద ఉన్నపుడే చేసేయాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో చెప్పిన ఈ పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఒక లెజెండరీ దర్శకుడికి అక్షరాలా అతికినట్లు సరిపోయింది. ఆ పెద్ద మనిషి మరెవరో కాదు.. తొమ్మిదిన్నర దశాబ్దాల వయసులోనూ పసిబాలుడి ఉత్సాహంతో, సినిమానే శ్వాసగా బతుకుతున్న దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు. వయసు అనేది కేవలం శరీరానికే కానీ, సృజనాత్మకతకు, కలలకు కాదని ఆయన తన ప్రతి అడుగులోనూ నిరూపిస్తూనే ఉన్నారు. ముప్పై ఏళ్లకే మోకాళ్ల నొప్పులు, నలభై ఏళ్లకే నడుము నొప్పులు అంటూ నేటి తరం యువత శారీరకంగా, మానసికంగా త్వరగా అలసిపోతున్న ఈ రోజుల్లో.. 94 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఏమాత్రం శక్తి తగ్గలేదు.

పైగా ఈ తరం జెన్-జీ ప్రేక్షకుల నాడి పట్టుకుని.. వాళ్లను సైతం ఆశ్చర్యపరిచేలా సరికొత్త కాన్సెప్ట్‌తో ఆయన మన ముందుకు వస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన 24 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా, వినూత్నంగా ఆలోచిస్తున్న తీరు చూసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సైతం సలామ్ చేస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. యావత్ ఇండియన్ సినిమా రంగానికి సింగీతం శ్రీనివాసరావు ఒక సజీవ నిఘంటువు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక పాఠం.. ఆయన సృష్టించిన ప్రతి కథా ఒక ప్రయోగశాల. ‘భైరవ ద్వీపం’తో జానపదాల్లో మాయాజాలాన్ని చూపించినా, ‘ఆదిత్య 369’లో టైమ్ మెషీన్ తో కాలాన్ని పరుగులు పెట్టించినా, ‘అపూర్వ సహోదరులు’తో కమల్ హాసన్ చేత మరుగుజ్జు పాత్ర చేయించి మెప్పించినా, ‘బృందావనం’తో స్వచ్ఛమైన హాస్యాన్ని పంచినా.. అది ఒక్క సింగీతంకే చెల్లింది. ట్రెండ్ ఫాలో అవ్వడం కాకుండా, ట్రెండ్ సెట్ చేయడం ఆయన శైలి.

సినిమా అంటే ఎవరైనా తీస్తారు.. కానీ ఎన్ని తరాలు మారినా ఎప్పటికీ నిలిచిపోయే ‘టైమ్ లెస్ క్లాసిక్స్’ తీయడం కేవలం ఆయనకే సాధ్యమైంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం తపించే సింగీతం.. ఇప్పుడు తన సుదీర్ఘ కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా పేరే ‘సింగ్ గీతం’. ఈ సినిమా కాన్సెప్ట్ వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో అసలు మాటలే ఉండవు. సినిమా మొత్తం కేవలం పాటలతోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సంభాషణలు లేకుండా, ఒక కథను కేవలం పాటలతో, సంగీతంతోనే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం ఒక గొప్ప కళ. 2.17 గంటల సినిమాని కేవలం పాటలతోనే నడిపించడం అంటే వేరే ఏ దర్శకుడికైనా కత్తిమీద సామే. ఇది వర్కవుట్ అవుతుందా? అని సందేహాలు కూడా రావచ్చు. కానీ మెగాఫోన్ పట్టింది సింగీతం కాబట్టి.. ఆ సందేహాలకు తావు లేదు.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే మూడున్నర దశాబ్దాల క్రితమే మాటలు లేకుండా ‘పుష్పక విమానం’ లాంటి అద్భుతమైన మూకీ చిత్రాన్ని తీసి.. కేవలం మౌనంతోనే అన్ని ఎమోషన్స్ పండించిన గొప్ప ఘనత సింగీతం సొంతం. అలాంటి దర్శకుడికి ఇప్పుడు పాటలను ప్రాణంగా చేసుకుని ఒక కథను నడిపించడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో ‘సింగ్ గీతం’ ఎప్పటికీ నిలిచిపోయే మరో అద్భుత మాస్టర్ పీస్‌గా మిగిలిపోవాలని ఆయన అభిమానులు, సగటు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పాటే ప్రాణంగా, సంగీతమే శ్వాసగా రాబోతున్న ఈ ‘సింగ్ గీతం’ పాటల ప్రయాణం జూన్ 11న అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. 94 ఏళ్ల ఈ యువ దర్శకుడు మరోసారి తన మ్యాజిక్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశిద్దాం..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద