వెబ్ సిరీస్‌‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా.. ‘ఇన్‌స్పెక్టర్ అవినాశ్’తో ప్రేక్షకుల ముందుకు..

బాలీవుడ్‌లో వెరైటీ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రణ్‌దీప్ హుడా. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న

  • uppula Raju
  • Publish Date - 2:52 pm, Sun, 17 January 21
వెబ్ సిరీస్‌‌లో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా.. ‘ఇన్‌స్పెక్టర్ అవినాశ్’తో ప్రేక్షకుల ముందుకు..

బాలీవుడ్‌లో వెరైటీ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రణ్‌దీప్ హుడా. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే’ సినిమాతో పాటు, ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ‘ఇన్‌స్పెక్టర్ అవినాశ్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

ఇప్పుడు సర్కారీ తుపాకీ వేడి చూపిస్తాం రిపోర్టింగ్ డ్యూటీ టుడే అంటూ ఇన్ స్టా వేదికగా కామెంట్ చేశారు రణ్‌దీప్ హుడాకు జోడిగా నటించే ముంబై బ్యూటీ ఊర్వశీ రౌటెలా. హాటెస్ట్ మోడల్ కమ్ యాక్ట్రెస్ ఊర్వశి రౌటెలా, చివరి సారిగా ‘వర్జిన్ భానుప్రియ’ మూవీలో కనిపించగా, ఇదివరకు ‘సెక్స్ చాట్ విత్ పప్పు అండ్ పాప’, ‘ద డ్యాన్స్ ప్రాజెక్ట్’వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. మహేష్ మంజ్రేకర్, రజనీష్ దుగ్గల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ కాప్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను నీరజ్ పాఠక్ తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..

Boycott Tandav: తాండవ్ సినిమాపై వివాదం.. ‘యాంటీ హిందూ సిరీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..