ఒక్క ఫైట్ కోసం.. శంకర్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..!

ఒక్క ఫైట్ కోసం.. శంకర్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..!

భారత సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల లిస్ట్‌లో కోలీవుడ్ డైరక్టర్ శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. పలు సందేశాత్మక చిత్రాలు తీసిన ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటివరకు ఏదైనా ప్రయోగాత్మక సినిమా తీయాలంటే ఆయన పేరే వినిపించేది. అయితే రోబో తరువాత ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇక ‘ఐ’,’2.o’ చిత్రాల పరాజయాల తరువాత శంకర్ మరింత డీలా పడ్డారు. ఇప్పుడు ఈయనతో సినిమాలు నిర్మించేందుకు పెద్ద పెద్ద నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఇప్పుడే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 19, 2019 | 3:57 PM

భారత సినీ పరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల లిస్ట్‌లో కోలీవుడ్ డైరక్టర్ శంకర్ పేరు కచ్చితంగా ఉంటుంది. పలు సందేశాత్మక చిత్రాలు తీసిన ఆయన జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. మొన్నటివరకు ఏదైనా ప్రయోగాత్మక సినిమా తీయాలంటే ఆయన పేరే వినిపించేది. అయితే రోబో తరువాత ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇక ‘ఐ’,’2.o’ చిత్రాల పరాజయాల తరువాత శంకర్ మరింత డీలా పడ్డారు. ఇప్పుడు ఈయనతో సినిమాలు నిర్మించేందుకు పెద్ద పెద్ద నిర్మాతలు సైతం భయపడుతున్నారు. ఇప్పుడే ఈ ప్రభావమే కమల్‌ హాసన్‌తో ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’పై పడింది.

1996లో విజయం సాధించిన ‘ఇండియన్’ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మొదట భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. అయితే ‘2.O’ తరువాత ‘ఇండియన్ 2’ బడ్జెట్‌పై శంకర్‌కు నిర్మాతలకు మధ్య విబేధాలు వచ్చినట్లు టాక్. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే తప్పని పరిస్థితుల్లో బడ్జెట్ పరిమితుల్లోనే సినిమా పూర్తి చేసేందుకు శంకర్ అంగీకరించడంతో.. మళ్లీ ఈ మూవీ షూటింగ్ ముందుకు కదిలింది.

కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్‌లను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం భోపాల్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఒక్క ఫైట్ కోసం రూ.40కోట్లను ఖర్చు చేస్తున్నారట శంకర్. కమల్‌తో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఇందులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు ఎంత చెప్పినా.. శంకర్ మాత్రం తాను తగ్గనని ఈ ఫైటింగ్ సీన్‌కు శంకర్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రకుల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, విద్యుత్ జమ్మాల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu