పెళ్లైనా నటనను కొనసాగిస్తా: అంజలి

కోడంబాక్కం: ‘కట్రదు తమిళ్‌’ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తర్వాత ఆమెకు పలు అవకాశాలు రావడంతో తమిళమ్మాయిగా మారిపోయారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అంజలి ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ‘తరమణి’, ‘పేరన్బు’ తదితర చిత్రాల్లో నటించారు. సహజమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఇప్పటికీ తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఓ తమిళ నటుడిని పెళ్లాడనున్నారని, […]

పెళ్లైనా నటనను కొనసాగిస్తా: అంజలి
నేడు అంజలి పుట్టిన రోజు సందర్భంగా ఈ అమ్మడికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, పలువురు సినిమా తారలు విషెస్ తెలుపుతున్నారు. 
Follow us

|

Updated on: Feb 24, 2019 | 3:07 PM

కోడంబాక్కం: ‘కట్రదు తమిళ్‌’ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయమైన తెలుగమ్మాయి అంజలి. ఈ సినిమా తర్వాత ఆమెకు పలు అవకాశాలు రావడంతో తమిళమ్మాయిగా మారిపోయారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన అంజలి ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే వరసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ‘తరమణి’, ‘పేరన్బు’ తదితర చిత్రాల్లో నటించారు. సహజమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఇప్పటికీ తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఓ తమిళ నటుడిని పెళ్లాడనున్నారని, ఆ తర్వాత సినిమాల్లో నటించరని ఇటీవల వార్తలు వినిపించాయి. దీనిపై అంజలి స్పందిస్తూ ‘ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. ఒకవేళ వెంటనే పెళ్లి అయినా.. నటనను మాత్రం కొనసాగిస్తా. పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యే అవకాశం లేదు. పెళ్లి తర్వాత పరిశ్రమకు దూరమైన హీరోయిన్లంతా మళ్లీ నటించడానికి వస్తున్నప్పుడు.. నేనెందుకు పెళ్లైన తర్వాత ఇంట్లో కూర్చోవాలంటోంది అంజలి.