మహేశ్ బాబు చిన్న పిల్లాడు కావడంతో నేను హీరో అయ్యాను: అలీ

హైదరాబాద్: మహేశ్ బాబు బదులు తాను హీరో అయ్యానని అన్నారు కమెడియన్ అలీ. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా దూసుకుపోతున్న అలీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను హీరో అయిన విధానం గురించి చెప్పారు. హిట్ మూవీ యమలీల గురించి చెబుతూ మొదట ఆ సినిమాకు ప్రిన్స్ మహేశ్ బాబును హీరోగా అనుకున్నారని చెప్పారు. అయితే ఈ విషయమైన డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి గారు సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించగా మహేశ్ […]

మహేశ్ బాబు చిన్న పిల్లాడు కావడంతో నేను హీరో అయ్యాను: అలీ
Follow us

|

Updated on: Feb 25, 2019 | 4:29 PM

హైదరాబాద్: మహేశ్ బాబు బదులు తాను హీరో అయ్యానని అన్నారు కమెడియన్ అలీ. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా దూసుకుపోతున్న అలీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను హీరో అయిన విధానం గురించి చెప్పారు. హిట్ మూవీ యమలీల గురించి చెబుతూ మొదట ఆ సినిమాకు ప్రిన్స్ మహేశ్ బాబును హీరోగా అనుకున్నారని చెప్పారు.

అయితే ఈ విషయమైన డైరెక్టర్ ఎస్వీ కృష్ణా రెడ్డి గారు సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించగా మహేశ్ చదువుకుంటున్నాడని, అప్పుడే పూర్తి స్థాయి సినిమా వద్దని చెప్పారట. దీంతో ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు తనను సంప్రదించి మూవీ తననే హీరోగా సినిమా తీశారని, అది పెద్ద హిట్టయ్యిందని అలీ అన్నారు. నిజానికి ఆ సమయంలో తనతో సినిమా వద్దని పలువురు కృష్ణారెడ్డిగారికి సూచించారు. అయినా ఆయన మాత్రం కథనే నమ్మి ముందుకెళ్లారని అలీ గుర్తు చేసుకున్నారు.