బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్ హిట్ మూవీ.. హీరోయిన్‌గా హైదరాబాద్ అమ్మాయి..

హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టబోతోంది. తెలుగులో హిటైన 'సినిమా చూపిస్త మావ', 'జులాయి'..

బాలీవుడ్‌లోకి అల్లు అర్జున్ హిట్ మూవీ.. హీరోయిన్‌గా హైదరాబాద్ అమ్మాయి..
Follow us

|

Updated on: Nov 20, 2020 | 5:58 PM

Hyderabad Girl Amrin Qureshi: హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టబోతోంది. తెలుగులో హిటైన ‘సినిమా చూపిస్త మావ’, ‘జులాయి’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో హీరోగా మిధున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి హీరోగా నటిస్తున్నాడు. రాయల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత ఎం.ఐ ఖురేషి మనవరాలు అమ్రిన్ ఖురేషి. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో కూడా ఈమెకు పలు అవకాశాలు వస్తున్నాయి.

కాగా, ‘సినిమా చూపిస్త మావ’ హిందీలో ‘బ్యాడ్ బాయ్’ పేరుతో రీమేక్ కానుంది. ఈ సినిమాకు రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించనున్నారు. ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సాజిద్‌ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే జులాయి రీమేక్‌ను టోని డిసౌజా దర్శకత్వం వహిస్తారు. జనవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.