మహేష్ బాబు కు ఎయిర్ పోర్ట్ లో ఘోర అవమానం

మహేష్ బాబు కు ఎయిర్ పోర్ట్ లో ఘోర అవమానం

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 25వ చిత్రం కాగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. రైతు సమస్యల నేపథ్యంలో దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రమంలో […]

Ravi Kiran

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:30 PM

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 25వ చిత్రం కాగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

రైతు సమస్యల నేపథ్యంలో దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రమంలో హీరో మహేష్ బాబు కు చేదు అనుభవం ఎదురైంది.  ఈ సినిమాలో కొన్ని సీన్స్ నిమిత్తం షూటింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చేయాల్సి ఉండగా యూనిట్ తో పాటు మహేష్ నిన్న ఉదయమే ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే అక్కడ అధికారులు మహేష్ ను అడ్డగించి.. ఢిల్లీ నుంచి అధికారుల పర్మిషన్ వచ్చేవరకు షూటింగ్ ఆపాలని కోరారు.

చిత్ర యూనిట్ షూటింగ్ కోసం అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం అని చెప్పినా వినలేదు ఎయిర్ పోర్ట్ అధికారులు. దీనితో మహేష్ బాబు.. తన వ్యాన్ లోనే దాదాపు ఐదు గంటల పాటు అధికారుల పర్మిషన్ కోసం వెయిట్ చేశాడట. చివరికి పర్మిషన్ లభించకపోయేసరికి మహేష్.. వెనుదిరిగాడు. ఇది ఇలా ఉంటే ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం.. పుల్వామా ఎఫెక్ట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై-అలెర్ట్ ప్రకటించడం వల్లే షూటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu