ఫుడ్‌లో పురుగులు.. ఫైర్ అయిన పవన్ హీరోయిన్!

ఫుడ్‌లో పురుగులు.. ఫైర్ అయిన పవన్ హీరోయిన్!

‘బంగారం’, ‘వాన’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ మీరా చోప్రాకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. అహ్మదాబాద్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా అందులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు హోటల్‌పై మీరా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అహ్మదాబాద్‌లోని డబుల్‌ ట్రీ అనే హోటల్‌కు వెళ్లా. అక్కడ ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా అందులో తెల్లటి పురుగులు కనిపించాయి. భారీ […]

Ravi Kiran

|

Aug 27, 2019 | 9:12 AM

‘బంగారం’, ‘వాన’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ మీరా చోప్రాకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. అహ్మదాబాద్‌లోని ఓ హోటల్‌కు వెళ్లి ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా అందులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు హోటల్‌పై మీరా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘అహ్మదాబాద్‌లోని డబుల్‌ ట్రీ అనే హోటల్‌కు వెళ్లా. అక్కడ ఫుడ్‌ ఆర్డర్‌ చేయగా అందులో తెల్లటి పురుగులు కనిపించాయి. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని నాకు ఇలాంటి పురుగులున్న ఫుడ్‌ పెట్టారు. ఇది చూసి షాక్‌కు గురయ్యా.. దీనిపై ఫుడ్ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ తన పోస్టులో పేర్కొంది. మీరా ప్రస్తుతం ‘సెక్షన్‌ 375’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu