‘నిశ్శబ్దం’ షూటింగ్‌లో అనుష్క ఏం చేసిందో చూడండి..!

అనుష్క, మాధవన్ ప్రధానపాత్రల్లో హేమంత్ మధుకర్‌ తెరకెక్కించిన చిత్రం నిశ్శబ్దం. ఇందులో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్ మ్యాడ్‌సేన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుష్కకు సంబంధించిన ఓ ఫొటోను తాజాగా దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ సమయంలో స్వీటీ కెమెరాను హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు తీసిన ఫొటో అంటూ […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:12 pm, Fri, 24 April 20
'నిశ్శబ్దం' షూటింగ్‌లో అనుష్క ఏం చేసిందో చూడండి..!

అనుష్క, మాధవన్ ప్రధానపాత్రల్లో హేమంత్ మధుకర్‌ తెరకెక్కించిన చిత్రం నిశ్శబ్దం. ఇందులో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్ మ్యాడ్‌సేన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పోరేషన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుష్కకు సంబంధించిన ఓ ఫొటోను తాజాగా దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ సమయంలో స్వీటీ కెమెరాను హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు తీసిన ఫొటో అంటూ ఆయన కామెంట్ పెట్టారు.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌లలో విడుదల చేయాలనుకుంటున్నారని.. రిలీజ్ విషయంలో నిర్మాతలకు, అనుష్కకు మధ్య పెద్ద వివాదం నడుస్తోందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నిర్మాతలు ఆ మధ్యన క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. గ్యాంగ్ అరెస్ట్