మెగాస్టార్ 152పై క్లూ ఇచ్చిన రామ్ చరణ్..?

మెగాస్టార్ 152పై క్లూ ఇచ్చిన రామ్ చరణ్..?

సైరాతో తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడంతో పాటు తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు ఆయన 152 సినిమాకు సిద్ధమవుతున్నారు. టాప్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా తన గత సినిమాల్లోలాగే ఈ మూవీని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 18, 2019 | 6:07 PM

సైరాతో తన డ్రీమ్‌ను నెరవేర్చుకోవడంతో పాటు తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాను ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు ఆయన 152 సినిమాకు సిద్ధమవుతున్నారు. టాప్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

కాగా తన గత సినిమాల్లోలాగే ఈ మూవీని కొరటాల ఓ సామాజిక సందేశంతో తెరకెక్కించబోతున్నట్లు ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఇటీవల చరణ్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. కొరటాల ఆఫీసుకు వెళ్లిన చెర్రీ, ఆయనతో ఫొటో తీసుకొని దాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందులో వీరిద్దరి మధ్యలో చార్లీ చాప్లిన్ ఫొటో ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే చిరు సినిమాపై వీరిద్దరు చిన్న క్లూ ఇచ్చారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే కామెడీ నేపథ్యంలో చిరు-కొరటాల మూవీ ఉండబోతుందేమోనని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే కామెడీ చేయడం చిరుకు కొత్తేం కాదు. ఎన్నో చిత్రాల్లో ఆయన అద్భుత కామెడీని పండించారు. చంటబ్బాయి, బావగారు బావున్నారా, శంకర్‌దాదా జిందాబాద్ వంటి చిత్రాల్లో ఆయన మంచి కామెడీని చేశారు. ఇక చిరు కామెడీ బాగా చేస్తారని పెద్ద పెద్ద దర్శకులు కితాబిచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

https://www.instagram.com/p/B3ua9Omns_Z/

అయితే ఇప్పుడు చిరు-కొరటాల సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరోలా ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో కచ్చితంగా ఓ సెన్సేషనల్ చిత్రం రాబోతుందని వారంతా భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ వీరిద్దరి కాంబోలో తెరకెక్కేది కామెడీ సినిమా అంటే వారు కాస్త నిరాశకు గురవుతున్నారు. అయితే అది కేవలం ఫొటో మాత్రమేనని.. చిరు తదుపరి చిత్రం పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తోనే ఉండబోతుందన్నది ఫిలింనగర్ టాక్. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి చిత్రం రాబోతోంది..? ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..? ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది..? ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu