‘అవును’ నటుడు హర్షవర్ధన్‌కి కరోనా పాజిటివ్‌

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వీరు-వారని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు.

  • Updated On - 3:16 pm, Tue, 6 October 20 Edited By:
'అవును' నటుడు హర్షవర్ధన్‌కి కరోనా పాజిటివ్‌

Harshvardhan Rane Corona: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వీరు-వారని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజగా నటుడు హర్షవర్ధన్‌కి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు హర్షవర్ధన్ తెలిపారు.

”జ్వరం, కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లా. కాలేయం ఆరోగ్యంగా ఉంది అని, వైరల్ జ్వరం అవ్వొచ్చని వైద్యులు చెప్పారు. రొటీన్‌గా కరోనా పరీక్ష చేయించా. నాకు కరోనా పాజిటవ్‌ వచ్చినట్లు ఆరోగ్య సేతు యాప్‌ చెప్పింది. ఇప్పటి నుంచి ఓ 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటా. మీకో శుభవార్త చెప్పాలి. కానీ అందుకోసం 10 రోజులు ఆగాలి. ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తా. దయచేసి మీరు ఏం బాధపడకండి. అలాగే వాట్సాప్ యూనివర్సిటీ రెమిడీస్‌ని పంపకండి. మీ ప్రేమను మాత్రమే పంపండి” అని హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. కాగా తకిట తకిట, అవును, అవును 2, మాయ వంటి సినిమాల ద్వారా హర్షవర్ధన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

Read More:

రియా జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు.. అప్పటివరకు జైలులోనే నటి

దివ్యాంగుల కోసం ఉపాసన మంచి పనికి చెర్రీ సహకారం