హైదరాబాద్ : ‘ఘాజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. కాగా ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా ఆయన తీసిన ‘అంతరిక్షం 9000 కెఎంపీహెచ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి మరో ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మరో టెక్నికల్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వినికిడి. దీనిపై త్వరలోనే […]
హైదరాబాద్ : ‘ఘాజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. కాగా ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా ఆయన తీసిన ‘అంతరిక్షం 9000 కెఎంపీహెచ్’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి మరో ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఆయన మరో టెక్నికల్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వినికిడి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయట.