భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి మరో తెలుగు సినిమా ఎంపిక.. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో..

ఈ ఏడాది భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి మరొక తెలుగు సినిమా ఎంపికైంది. తాజాగా కేంద్ర సమాచార,

  • uppula Raju
  • Publish Date - 5:53 am, Sun, 20 December 20
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి మరో తెలుగు సినిమా ఎంపిక.. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో..

ఈ ఏడాది భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి మరొక తెలుగు సినిమా ఎంపికైంది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ 51వ ఐఎఫ్ఎఐ కోసం భారతీయ పనోరమ విభాగం నుంచి పలు చిత్రాలను ప్రకటించారు. అందులో తెలుగు సినిమా నుంచి ‘గతం’ సినిమా ఎంపికైంది. కిరణ్ కొండమడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 16న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో భార్గవ పోలుదాసు, రాకేశ్, గాలేభే, పూజిత కురపర్తి కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్ ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఐఎఫ్ఎఫ్ఐలో భాగంగా ఇండియన్ పనోరమ నుంచి ఎంపికైంది. జనవరిలో గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ఈ చిత్ర ప్రదర్శన ఉంటుంది. సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే పూర్తి చేశారు. అయితే గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎఫ్2 నిలిచింది. కాగా ఈ ఫెస్టివల్ జనవరి 16 నుంచి 21 వరకు నిర్వహిస్తారు.