అప్పుడు వద్దన్న సినిమాకు మళ్లీ ఓకే చెప్పాడా..!

ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా తరువాత ఆయన ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఎన్నో అంచనాల మధ్య 2018లో వచ్చిన జీరో కూడా పెద్ద డిజాస్టర్‌గా మారింది. దీంతో సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు షారూక్. ఈ విషయాన్ని ఓ సందర్భంలో వెల్లడించిన షారూక్.. ఎన్ని సంవత్సరాలు సినిమాలు చేయనో తెలీదు. ఇప్పుడు కుటుంబానికి […]

అప్పుడు వద్దన్న సినిమాకు మళ్లీ ఓకే చెప్పాడా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jan 08, 2020 | 9:48 AM

ఒకప్పుడు వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపిన బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ ఈ మధ్య కాస్త స్లో అయ్యారు. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా తరువాత ఆయన ఖాతాలో పెద్ద హిట్ లేదు. ఎన్నో అంచనాల మధ్య 2018లో వచ్చిన జీరో కూడా పెద్ద డిజాస్టర్‌గా మారింది. దీంతో సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు షారూక్. ఈ విషయాన్ని ఓ సందర్భంలో వెల్లడించిన షారూక్.. ఎన్ని సంవత్సరాలు సినిమాలు చేయనో తెలీదు. ఇప్పుడు కుటుంబానికి సమయాన్ని కేటాయించాలనుకుంటున్నా. కథ నచ్చినప్పుడే సినిమాలు చేస్తా అని వెల్లడించారు.

అయితే షారూక్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు. ఓ పక్క మిగిలిన హీరోలు ఫ్లాప్‌లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తుంటే.. తమ అభిమాన నటుడు మాత్రం మూవీలు చేయకపోతే ఎలా అంటూ తెగ వర్రీ అవుతున్నారు. అంతేనా ఇటీవల ఓ అభిమాని షారూక్ మీరు నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేస్తారా..? లేక నన్ను చచ్చిపోమంటారా..? అంటూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కూడా చేశారు. ఇలాంటి నేపథ్యంలో షారూక్ తదుపరి చిత్రానికి సిద్ధమౌతున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతరిక్షంలోకి వెళ్లిన భారత తొలి వ్యోమగామి రాకేశ్ శర్మ జీవిత కథ ఆధారంగా ఎప్పటినుంచో ఓ బయోపిక్‌ను తెరకెక్కించాలనుకుంటోన్న విషయం తెలిసిందే. దీనికి అప్పట్లో సారే జహాసే అచ్చా అనే టైటిల్ అనుకున్నప్పటికీ.. ఆ తరువాత సెల్యూట్‌గా ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఇందులో హీరోగా మొదట బాలీవుడ్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌‌ను అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆ తరువాత షారూక్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి షారూక్ కూడా తప్పుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ మూవీ స్క్రిప్ట్‌తో షారూక్ సంతృప్తిగా లేరని, డాన్ 3 కోసం ఈ మూవీని వదులుకున్నారని ఇలా వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు షారూక్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సిద్దార్థ్ రాయ్ కపూర్, రోన్ని స్క్రూవాలా సంయుక్తంగా దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో కూడా షారూక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu