ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ జీవితంలో ముందుకు సాగాలి.. నెటిజన్ ప్రశ్నకు రేణు సమాధానం

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో నటి రేణు దేశాయ్‌ ఒకరు. ఆ మీడియా వేదికగా అప్పుడప్పుడు అభిమానులు అడిగిన ప్రశ్నలకు రేణు సమాధానం ఇస్తుంటారు.

ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. కానీ జీవితంలో ముందుకు సాగాలి.. నెటిజన్ ప్రశ్నకు రేణు సమాధానం
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2020 | 11:20 AM

Renu Desai news: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో నటి రేణు దేశాయ్‌ ఒకరు. ఆ మీడియా వేదికగా అప్పుడప్పుడు అభిమానులు అడిగిన ప్రశ్నలకు రేణు సమాధానం ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆమె.. అభిమానుల ప్రశ్నలకు స్పందించారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ లవ్ ఫెయిల్యూర్‌, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆలోచన ఉన్న వారికి రేణును ప్రశ్నించారు. (‘ఎఫ్‌ 3’కి భారీ బడ్జెట్‌.. ఓకే చెప్పిన దిల్ రాజు.. వెంకీ, వరుణ్‌లకు సమాన పారితోషికం)

దానికి స్పందించిన రేణు.. ప్రేమలో విఫలమైతే ఉండే బాధ నాకు తెలుసు. నీకు ఇష్టమైన వ్యక్తులు నిన్ను మోసం చేయడం, నువ్వు బాధలో ఉన్నప్పుడు వారు నీ పక్కన లేకపోవడం అత్యంత బాధకరమైన విషయం. కానీ ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం చాలా తప్పు. నీ జీవితంలో నీకంటే నీకు ఎవరూ ముఖ్యం కాదు. జీవితంలో ముందుకు సాగాలి. కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో సులభంగా ఆ బాధ నుంచి బయట పడొచ్చని ఆమె సూచించారు. కాగా ప్రస్తుతం రేణు.. ఆధ్య అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే పలు మూవీల కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. (ఇక్కడ మీరు మాత్రమే మిస్‌ అయ్యారు.. కానీ నాతో పాటే ఉన్నారు.. తండ్రిపై ప్రియాంక భావోద్వేగ ట్వీట్‌